మైక్రోమ్యాక్స్ YU బ్రాండ్ నుండి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది..

మైక్రోమ్యాక్స్ YU బ్రాండ్ నుండి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది..
HIGHLIGHTS

సెప్టెంబర్ 8 న జరగబోయే ఈవెంట్ కోసం invite పంపింది.

YU బ్రాండ్ నుండి సెప్టెంబర్ 8 న కొత్త మొబైల్ లాంచ్ అవుతుంది. కంపెని మీడియా అందరికీ ఇన్విటేషన్లు పంపింది ఇదే విషయం పై. దీని ధర ఇంకా తెలియదు.

invite లో ఇలా వ్రాసింది "ఫ్యూచర్ కనుక గతాన్ని కలిస్తే, నెక్స్ట్ వండర్ అవుతుంది". దీనితో పాటు రిలీజ్ చేయబోయే మొబైల్ యొక్క సైడ్ ఇమేజ్ ను కూడా జోడించింది ఇన్విటేషన్ లో.

ట్విటర్ లో కూడా మైక్రోమ్యాక్స్ యు బ్రాండ్ "మోనా లీసా కు కనుక సేల్ఫీ స్టిక్ ఉంటే ఇప్పటికీ మనకు చాలా అందమైన ఆమె ఫోటోలు ఉండేవి" అని ట్విట్ చేసింది. ఈ మాట ద్వారా ఫోన్ లో సేల్ఫీ ఫ్రంట్ కెమేరా కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనుంది.

ఈ ఫోన్ స్నాప్ డీల్ లో ఎక్స్క్లూజీవ్ గా రిలీజ్ అవనుంది. ఇంత వరకూ YU అమెజాన్ లో సేల్ అయ్యింది. తాజాగా YU నుండి MIUI బాండ్ కు పోటీగా YU ఫిట్ స్మార్ట్ బాండ్ అమెజాన్ లో రిలీజ్ అవటం, చాలా వరకూ పనిచేయక రిటర్న్ అవటం జరిగాయి.

బహుసా ఆ కారణం వలన ఇప్పుడు స్నాప్ డీల్ లో సేల్ చేయవలసి వస్తుందా YU బ్రాండ్ కు అనే ప్రశ్న ఉంది. ఫోన్ పరంగా మిగిలిన విషయలు ఏమీ ఇంకా తెలియదు.

కాని ఇప్పటివరకూ YU తక్కువ ధరకు మంచి హార్డ్ వేర్ స్పెక్స్ ఇవ్వటం గమనిస్తే, రాబోయే మోడల్ కూడా మినిమమ్ రిజనబుల్ ప్రైసింగ్ తో రావచ్చు. YU నుండి యురేకా, యురేకా ప్లస్, యుఫోరియా అండ్ లేటెస్ట్ గా యు ఫిట్ వాచ్ బాండ్ రిలీజ్ అయ్యాయి ఇప్పటికి.

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo