YU బ్రాండ్ నుండి 4gb ర్యామ్, 21MP కెమేరా తో Yutopia కొత్త మోడల్ లాంచ్

Updated on 17-Dec-2015

కొన్ని నెలల పాటు మార్కెటింగ్.. సోషల్ పోస్ట్స్, టీసర్స్ తరువాత మైక్రోమాక్స్ సబ్ బ్రాండింగ్ YU నుండి Yutopia స్మార్ట్ ఫోన్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. 

దీని ప్రత్యేకత స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్ తో వస్తున్న మోస్ట్ affordable ఫోన్ ఇదే. అమెజాన్ లో డిసెంబర్ 26 నుండి సేల్స్ స్టార్ట్. ఈ రోజు నుండి ప్రీ బుకింగ్స్ చేసుకోగలరు.

స్పెసిఫికేషన్స్ – 5.2 in OGS కార్నింగ్ గొరిల్లా గ్లాస్ with 565 PPi అండ్ 2560 x 1440 పిక్సెల్స్ రిసల్యుషణ్ LCD డిస్ప్లే. ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810 SoC.

2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్ + 1.5GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్. డ్యూయల్ సిమ్, 4GB LP DDR4 ర్యామ్, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్.

21MP సోనీ డ్యూయల్ టోన్ led ఫ్లాష్ OIS అండ్ phase డిటెక్షన్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా, ఫోకస్ టైమ్ హాఫ్ సెకెండ్ కన్నా తక్కువ ఉంటుంది అని కంపెని ప్రొమోషన్.

4K వీడియో షూటింగ్ @30fps, అండ్ 8MP ఫ్రంట్ కెమేరా, ఫింగర్ ప్రింట్ స్కానర్ (ఇది సేల్ఫీ ఫోటో క్లిక్ గా పనిచేస్తుంది), 3000 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0.

cyanogen 12.1 os on ఆండ్రాయిడ్ 5.1. మార్ష్ మల్లో  అప్ గ్రేడ్. DTS ఆడియో అండ్ Marley Little Birds ఇయర్ ఫోన్స్. thickness 7.2mm. బరువు 159 గ్రా.

ఫోన్ తో పాటు కంపెని "Around YU" అనే కొత్త యాప్ రిలీజ్ చేసింది. ఇది మీ ఫోన్ లో ఉన్న ఇతర యాప్స్ నుండి ఇన్ఫర్మేషన్ ను తెచ్చి అన్నీ దీనిలో చూపిస్తుంది.

దీని ప్రైస్ – 24,999 రూ.

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :