మైక్రోమ్యాక్స్ YU నుండి చిన్న ఫోటో ప్రింటర్, YUpix

Updated on 07-Sep-2015
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ & ios ఫోనుల నుండి వైఫై సహాయంతో ఫోటో ప్రింట్ తీస్తుంది.

పాకెట్ సైజ్ లో ఉండే ఫోటో ప్రింటర్ ను తయారు చేసింది, YU బ్రాండ్. ఇది మైక్రోమ్యాక్స్ యొక్క సబ్ బ్రాండింగ్. ఇది వరకూ యురేకా, యుఫోరియా, యు ఫిట్ బాండ్ అండ్ యురేకా ప్లస్ ఫోనులను లాంచ్ చేసింది.

ఈ ప్రింటర్ పేరు, YUpix. దీని ధర 6,999 రూ.  కంప్యూటర్ సహాయం లేకుండా ఎటువంటి స్మార్ట్ ఫోన్ నుండి అయినా ఫోటోలను ప్రింట్ తీయగలదు యు పిక్స్. ఆండ్రాయిడ్ అండ్ ios లకు ఉన్న యు పిక్స్ అనే యాప్ ద్వారా పనిచేస్తుంది.

స్మార్ట్ ఫోన్ నుండి దీనిలోకి ఫోటోలను ట్రాన్సఫర్ చేసుకోవటానికి, యు పిక్స్ వైఫై, వైఫై direct అండ్ NFC ఫీచర్స్ తో వస్తుంది. కేవలం 60 సెకెండ్ లలో ప్రింట్ ఇవ్వగలదు. ink ribbon అండ్ ఫోటో పేపర్ cartridges తో పనిచేస్తుంది. అంటే 20 ink sheets మరియు ink ఉంటాయి cartridge లో.

ప్రింటింగ్ అనే కాకుండా ఫోటోలను ఎడిట్ కూడా చేసుకోగలరు. ఇది అమెజాన్ లో ఎక్స్క్లూజివ్ గా సేల్ అవుతుంది. దీనిలో 54 x 86 mm సైజ్ లో ఉన్న ఫోటోలను 291PPi తో ప్రింట్ చేయగలిగే టెక్నాలజీ ఉంది. 750 mah బ్యాటరీ తో వస్తుంది. సెప్టెంబర్ 8 న మరో డివైజ్ లాంచ్ చేస్తుంది YU.

Connect On :