మొబైల్ పేర్లను యూజర్స్ కే పెట్టమని YU బ్రాండ్ కొత్తగా మార్కెట్ లోకి వస్తే తమ మొబైల్ లాంచ్ ఈవెంట్ ను VR నుండి చూడండి అని వన్ ప్లస్ 2 కంపెని మార్కెటింగ్ చేసింది. ఇప్పుడు మోటోరోలా కూడా రిలీజ్ కు ముందే యూజర్స్ ను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఈ నెల 28న రిలీజ్ కాబోయే మోటో కొత్త మోడల్స్ లాంచ్ ఈవెంట్ ను మొదటి సారి live స్ట్రీమింగ్ యుట్యూబ్ లో ఇస్తుంది.
న్యూ డిల్లీ లో రేపు జరగనున్న మోటోరోలా అఫిషియల్ లాంచ్ ఈవెంట్ ను web cast చేస్తుంది కంపెని. మోటో యొక్క 3rd generations మొబైల్స్ (మోటో G, మోటో X) ను లాంచ్ చేస్తుంది రేపు. గ్లోబల్ లాంచ్ తో పాటు ఇండియాలో కూడా ఈవెంట్ చేయటం మన ఇండియన్ మార్కెట్ కు మోటోరోలా ఇస్తున్న ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు.
అయితే ఇప్పటి వరకూ ఈ మోడల్స్ పై చాలా రూమర్స్ వచ్చాయి. మోటో 3rd gen రెండు వేరియంట్స్ లో రానుంది. ఒక్క ప్రొసెసర్ మినహా అన్ని సేం గా ఉండే ఈ రెండు వేరియంట్స్ వాటర్ resistant తో వస్తున్నాయనేది మోస్ట్ రుమార్డ్ స్పెక్. మోటో x 3rd gen కూడా వాటర్ resistant తో రానుంది అని న్యూస్. దీనిలో ఫింగర్ ప్రింట్ స్కానర్, 4gb ర్యామ్, 21 MP రేర్ మరియు 13 MP ఫ్రంట్ కెమేరాలు ఉండనున్నాయని రూమర్డ్ స్పెక్స్ చెబుతున్నాయి.
రేపు సాయింత్రం 4.00PM కు జరగనున్న మోటోరోలా ఇండియా అఫిషియల్ live స్ట్రీమింగ్ ఈవెంట్ ను Youtube లో ఈ లింక్ లో చూడగలరు.