Xolo అప్ కమింగ్ మోడల్ "Xolo బ్లాక్" టీసర్ వీడియోను విడుదల చేసింది. బ్లాక్ అనే పేరుతో Xolo మరో సబ్ బ్రాండ్ ను లాంచ్ చేస్తుంది. మే నెలలో అనౌన్స్ చేసిన ఈ సబ్ బ్రాండ్ నుండి మొదటి మోడల్ ను జులై లో విడుదల చేయనుంది Xolo. దీని ధర 15,000 వేల లో ఉండనుంది. సంవత్సరానికి బ్లాక్ సిరిస్ లో నాలుగు మోడల్స్ రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉంది కంపెని. Xolo బ్లాక్ మొదటి మోడల్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే సేల్ అవుతుంది.
టీజర్ లోని వీడియో మరియు ట్యాగ్ లైన్ చూస్తుంటే, ఫోన్ కు 'nanoparticle' మరియు 'oleophobic' కోటింగ్ ఉండనున్నట్లు అనిపిస్తుంది. బ్యాక్ కెమేరాకు డ్యూయల్ సెట్ అప్ ఉంది. ఇది Bokeh మరియు డ్యూయల్ ఫోకస్ ఇమేజెస్ ఎఫెక్ట్స్ ను ఇస్తుంది.రెండు బ్యాక్ కెమేరాస్ మధ్యలో LED ఉంది. బ్యాక్ గ్లాసీ బాడీ ఫినిషింగ్ తో వస్తుంది. ఫోన్ యొక్క ఎడ్జెస్ ను గమనిస్తే, చూడటానికి ఇది బాగా స్లిమ్ బాడీ తో వస్తునట్టు అనిపిస్తుంది.
Xolo అనేది Lava బ్రాండ్ కు సబ్ బ్రాండ్ . బ్రాండ్ కో ఫౌండర్ మరియు డైరెక్టర్, విశాల్ సెహగల్ "బ్లాక్ సబ్ బ్రాండింగ్ నాలుగు ఇంపార్టెంట్ అంశాలలో ఎక్కువ ఫోకస్ చేయనుంది. అవి ఆడియో, కెమేరా, బ్యాటరీ, మరియు డిజైన్." అని అన్నారు.
మేము ఇంతకుముందు విశాల్ తో మాట్లాడినప్పుడు ఆయన, బ్లాక్ సిరిస్ లోని ఫోనులు ప్రస్తుత బడ్జెట్ ఫోనుల కన్నా ఎక్కువ ధరలో ఉంటాయని అలాగే ఎక్కువ ఫీచర్స్ తో వస్తాయని అని స్పష్టం చేశారు. ఈ ఫోనులు Xolo Vibe యూజర్ ఇంటర్ఫేస్ తో వస్తాయని అని అన్నారు. అయితే యూజర్ ఫీడ్ బ్యాక్ తో తమ UI లోని మార్పులు చేస్తారు అని కూడా అన్నారు.