అండర్ 10K బడ్జెట్ లో మరో స్మార్ట్ ఫోన్, Xolo Cube లాంచ్ అయ్యింది. దీని ధర 7,999 రూ. అయితే ఇదే సెగ్మెంట్ లో 2 జిబి ర్యామ్ తో ఫోనులు వస్తుండగా, ఇది మాత్రం 1జిబి ర్యామ్ తో వస్తుంది.
Xolo క్యూబ్ స్పెసిఫికేషన్స్ – 5in 720P స్క్రీన్, 1.3 GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ 6582M చిప్సెట్, 1జిబి ర్యామ్, 8జిబి ఇంటర్నెల్ స్టోరేజ్, 32 జిబి అదనపు స్టోరేజ్ సపోర్ట్, 8MP FHD వీడియో రికార్డింగ్ బ్యాక్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 2100mah బ్యాటరీ. 6.9mm సన్నని బాడీ తో ఫోన్ డిజైన్ చేయబడింది.
సేన్సర్స్ విషయానికి వస్తే లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, accelerometer ఉన్నాయి. దీనికన్నా తక్కువ ధర ఫోనుల్లో ఉన్న Gyroscope, దీనిలో లేదు. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ మరియు లేటెస్ట్ ac WiFi స్టాండర్డ్ కనెక్టివిటీ ఉంది.
Xolo క్యూబ్ కన్నా 4G మరియు 2జిబి ర్యామ్ ఉన్న రెడ్మి 2 యుఫోరియా మంచి ప్యాకేజ్ లో వస్తున్నాయి.