Poco M4 Pro: రేపు లాంచ్ అవుతుంది.. స్పెక్స్ ఎలా ఉన్నాయంటే..!

Updated on 09-Nov-2021
HIGHLIGHTS

Poco M4 Pro రేపు ఇండియాలో విడుదల అవుతుంది

ఇది Redmi Note 11 5G మాదిరిగా కనిపిస్తోంది

పోకో ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G SoC తో పనిచేస్తుంది

పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Poco M4 Pro రేపు విడుదల అవుతుంది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క  కీలకమైన స్పెషికేషన్స్  ముందుగానే ఆన్లైన్లో లీకయ్యాయి.  Poco M3 యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ గా Poco M4 Pro ను పోకో తీసుకువస్తోంది. ఆన్లైన్లో దర్శనమిచ్చిన  లీక్డ్ స్పెక్స్ పరిశీలిస్తే ఇది Redmi Note 11 5G మాదిరిగా కనిపిస్తోంది.

వియత్నామీస్ వెబ్‌సైట్ ది పిక్సెల్ నివేదిక ప్రకారం, పోకో ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G SoC మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ని కలిగిఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని నమూనా చిత్రాలను కూడా షేర్ చేసింది. అయితే, సెక్యూరిటీ కారణముగా ఈ ఫోన్ చిత్రాలను నిజచిత్రాలను తలపించే వాటిని మాత్రం షేర్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ గురించి వచ్చిన లీక్డ్ స్పెక్స్ వివరాలు క్రింద చూడవచ్చు.

Poco M4 Pro: లీక్డ్ స్పెక్స్

పోకో ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ ను కలిగి ఉంటుంది. పోకో ఎం4 ప్రో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 810 5G SoC తో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB/6GB/8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడుతుంది.

ఈ ఫోన్ యొక్క లేటెస్ట్ లీక్స్ కూడా ఈ ఫోన్ లో 50MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుందని సూచిస్తున్నాయి. అలాగే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 పైన ఆధారితంగా MIUI 12.5 స్కిన్ పైన నడుస్తుంది. అంటే, ఇది Redmi Note 11 ను పోలివుంటుంది. Poco M4 Pro వేగవంతమైన 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో అమర్చబడిందని చెప్పబడింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :