ఇంతవరకూ LG G5 మరియు Huawei P9 ఫోనుల్లో డ్యూయల్ కెమెరాలు ఉండేవి వెనుక వైపు. కాని ఇవి flagship(హై రేంజ్ బడ్జెట్) ఫోనులు…
ఇప్పుడు Xiaomi కంపెని రెడ్మి Pro అనే కొత్త మోడల్ రిలీజ్ చేసింది. నిన్న రిలీజ్ అయిన ఈ మోడల్ ద్వారా డ్యూయల్ కెమెరా సెట్ అప్ బడ్జెట్ రేంజ్ లోకి అడుగుపెట్టింది.
చైనాలో లాంచ్ అయిన ఫోన్ ఇండియన్ మార్కెట్ కు ఎప్పుడు వస్తుంది అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు. రెడ్మి Pro స్పెసిఫికేషన్స్ విశ్యనికివ్ వస్తే..
డ్యూయల్ సిమ్, 4G LTE కనెక్టివిటీ, OLED 5.5 in ఫుల్ HD డిస్ప్లే, మీడియా టెక్ Helio x25 ప్రొసెసర్, 4GB ర్యామ్, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్. ప్రైస్ – 20,000 రూ.
13MP సోనీ సెన్సార్ మరియు 5MP samsung సెన్సార్ – డ్యూయల్ రేర్ కేమేరాస్ ఉన్నాయి. రెండింటి నుండి ఫోటోస్ తీసి depth of field ను adjust చేస్తుంది.
3GB మరియు 32GB స్టోరేజ్ తో మరొక వేరియంట్ కూడా ఉంది. రెండు ఫోనుల్లో 4G అండ్ డ్యూయల్ సిమ్ ఉన్నాయి. ఈ వేరియంట్ ప్రైస్ 15,000 రూ.
చైనాలో సేల్స్ మొదలయ్యాయి. మొదటి సారి కంపెని చైనాలో ఆఫ్ లైన్ లో సేల్స్ స్టార్ట్ చేస్తుంది.