Xiaomi అంటే high end స్పెక్స్ ను తక్కువ ప్రెస్ లో అందించే స్మార్ట్ ఫోన్ కంపెనీ. కానీ రీసెంట్ గా GizmoChina రిపోర్ట్స్ ప్రకారం శాంసంగ్, ఐ ఫోన్, range లో ఒక ఫోన్ రిలీజ్ చేస్తుంది Xiaomi.
దీని ప్రెస్ సుమారు 40,500 రూ ఉండవచ్చు. రూమర్స్ ప్రకారం ఇది Mi Note సెకెండ్ జెనెరేషన్ మోడల్ అయ్యి ఉంటుంది అని అంచనా. సో ఇది Mi నోట్ 2 అనే అవకాశాలున్నాయి.
ఈ ఇయర్ సెప్టెంబర్ లో ఫోన్ రిలీజ్ అవుతుంది అని అంచనా. రీసెంట్ గా కంపెనీ దీనికి సంబందించి ఒక టీజర్ పిక్ కూడా రిలీజ్ చేసింది Weibo.
రూమర్స్ ప్రకారం ఫోన్ లో డ్యూయల్ curved స్క్రీన్ డిస్ప్లే, లేటెస్ట్ flagship స్పెక్స్(4GB RAM) తో ఉంటుంది అని అంచనా. కంపెనీ కో ఫౌండర్ ఫోన్ కాస్ట్ ఎక్కువుగా ఉంటుందేమో కానీ అన్నిటికన్నా బెటర్ క్వాలిటీ కలిగిన ప్రోడక్ట్ గా ఉంటుంది అని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి కంపెనీ లో highest price తో వస్తున్న ఫోన్ Mi 5. 24,999 రూ లకు లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 820SoC, 3GB రామ్, 32gb స్టోరేజ్ ఇస్తుంది.
Mi note 2 తో కంపెనీ గ్లోబల్ గా US వంటి మార్కెట్లలో ఐ ఫోన్ మరియు ఇతర ఫోనుల వలె లెవెల్ పెంచుకునే ఆలోచనలో ఉండటమే Mi నోట్ 2 వెనుక కారణాలు అనిపిస్తుంది.