3GB ర్యామ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రెడ్మి 3 ప్రో ను రిలీజ్ చేసింది Xiaomi

Updated on 30-Mar-2016
HIGHLIGHTS

చైనాలో రిలీజ్ అయ్యింది. ఇండియన్ రిలీజ్ పై స్పష్టత లేదు

Xiaomi జనవరి లో చైనాలో రిలీజ్ చేసిన రెడ్మి 3 మోడల్ కు ఇప్పుడు మరొక కొత్త అప్ గ్రేడ్ వేరియంట్ ను రిలీజ్ చేసింది చైనాలోనే. దీని పేరు రెడ్మి 3 ప్రో.

ఈ అప్ గ్రేడ్ మోడల్ లో 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. మిగిలిన అన్నీ స్పెసిఫికేషన్స్ రెడ్మి 3 లానే same.

రెడ్మి 3 ప్రో ఏప్రిల్ లో సేల్ అవనుంది చైనాలో. దీని ప్రైస్ 9,200 రూ. కంపెని లాంచ్ చేసిన దీని ఒరిజినల్ వేరియంట్ రెడ్మి 3 7,200 రూ లకు సేల్ అవుతుంది చైనా లో.

రెడ్మి 3 లో 5 in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 616 ప్రొసెసర్, 2GB ర్యామ్, 13MP రేర్ మరియు 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా సెట్ అప్, 4100 mah బ్యాటరీ, 16GB స్టోరేజ్ ఉన్నాయి.

Xiaomi రెడ్మి 3 ను ఇండియాలో ఇంకా రిలీజ్ చేయలేదు. రెడ్మి 3 ప్రో ను కూడా రిలీజ్ చేస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. కాని Mi 5 ఫ్లాగ్ షిప్ మోడల్ ను మన దేశంలో రేపు లాంచ్ చేయనుంది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :