15,000 రూ స్టార్టింగ్ ప్రైస్ తో Xiaomi Max స్మార్ట్ ఫోన్ మరియు MIUI 8 కొత్త వెర్షన్ లాంచ్

Updated on 10-May-2016

Xiaomi నుండి మాక్స్ పేరుతో స్మార్ట్ ఫోన్ లాంచ్ అవనుంది అని మొన్నటి వరకు చెప్పుకున్నాము కదా. ఇప్పుడు చైనా లో Mi మాక్స్  పేరుతో ఆ phablet లాంచ్ అయ్యింది.

phablet అంటే 6 in నుండి మొదలయ్యే స్క్రీన్ కలిగిన ఫోనులను ఫాబ్లేట్ అంటారు. దీనితో పాటు కంపెని MIUI 8 కొత్త వెర్షన్ విడుదల చేసింది చైనాలో.

Mi max స్పెసిఫికేషన్స్..

  • 6.44 in IPS LCD డిస్ప్లే – 7.5mm thin బాడీ – 203 గ్రా బరువు
  • స్నాప్ డ్రాగన్ 650/652 ప్రొసెసర్స్
  • 3 అండ్ 4GB ర్యామ్స్
  • 32GB/64GB/128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వేరియంట్స్
  • స్నాప్ డ్రాగన్ 650 SoC – 3GB ర్యామ్ – 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ – ఒక వేరియంట్ – ప్రైస్ 15,300 rs
  • స్నాప్ డ్రాగన్ 652 SoC – 3GB ర్యామ్ – 64GB స్టోరేజ్ – సెకెండ్ వేరియంట్ – 17,400 rs
  • స్నాప్ డ్రాగన్ 652 SoC – 4GB ర్యామ్ – 128GB స్టోరేజ్ – థర్డ్ వేరియంట్ -20,500 rs
  • 4850 mah బ్యాటరీ
  • 16MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా
  • ఫింగర్ ప్రింట్ స్కానర్, 4G ఇంటర్నెట్, డ్యూయల్ సిమ్
  • infrared sensor
  • 128GB SD కార్డ్ సపోర్ట్

MIUI 8 (Xiaomi కొత్త OS వెర్షన్) లో కొత్త సంగతులు..

  • వాల్ పేపర్ ఆటోమేటిక్ గా మారుతుంటుంది.
  • extra నోట్స్ ఫీచర్స్ తో పాటు password ప్రొటెక్షన్ ఉంది notes కు, సేవ్ కూడా చేయగలరు. ఇందుకు ఫింగర్ ప్రింట్ ను వాడగలరు
  • డ్రాప్ డౌన్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ కు స్క్రోలింగ్ ఫీచర్
  • weather కు తగ్గట్టుగా కలర్ థీమ్స్ అండ్ సెట్టింగ్స్ కలర్స్ చేంజ్.
  • పవర్ సేవర్ మోడ్ – ఇందులో బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ freeze అవుతాయి, పెర్ఫార్మన్స్ పెంచటానికి.

 

MIUI 8 ను వాడటానికి Xiaomi users కు MAY 16 నుండి బీటా రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు బీటా builds టెస్ట్ చేయటానికి రిజిస్టర్ అవ్వవచ్చు, జూన్ 1 న బీటా వెర్షన్ వస్తుంది testers కు. 

MIUI 8 వెర్షన్.. Mi 3, Mi 4, Mi 4c, Mi 4S, Mi 5, Mi Max మరియు అన్ని రెడ్మి అండ్ MI నోట్ ఫోన్లలోనూ సపోర్ట్ అవుతుంది.

 

Souvik Das

The one that switches between BMWs and Harbour Line Second Class.

Connect On :