షావోమి, పెద్ద ఇన్-బిల్ట్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో ఒక నమూనా స్మార్ట్ ఫోన్ చూపిస్తోంది

Updated on 17-Jan-2019
HIGHLIGHTS

ఒక 50.2 మిమీ x 25 మిమీ పరిమాణం గల, పెద్ద ఇన్-బిల్ట్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో ఒక ఫోనును, షావోమి ఒక వీడియోలో చూపిస్తోంది.

ముఖ్యాంశాలు:

1. షావోమి ఒక హ్యాండ్సెట్ యొక్క డిస్ప్లేలో వేలిముద్ర సెన్సార్ ఉండనున్నట్లు ఒక వీడియో పోస్ట్ చేసింది.

2. డిస్ప్లే పైన విస్తృత ప్రాంతంలో నొక్కడం ద్వారా ఈ ఫోన్ స్పష్టంగా అన్లాక్ చేయబడుతుంది.

3. ఈ ఫోన్లో ఉపయోగించిన సెన్సర్ పరిమాణం 50.2 మిమీ x 25 మిమీ గా ఉంటుంది.

వివో X20 ప్లస్ UD, ఇన్-డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. అదిమొదలుకొని, అనేక ఇతర హ్యాండ్ సెట్లు అటువంటి సాంకేతికతతో ప్రారంభించబడ్డాయి. ఈ టెక్ సాపేక్షంగా కొత్తగా ఉండగా, దాని పైన అంతకంటే పెద్ద ఆవిష్కరణ కనిపించడంలేదు. సాధారణంగా, వేలిముద్ర సెన్సారును  స్క్రీన్ యొక్క క్రిందభాగంలో చిన్న ప్రదేశంలో ఉంచుతారు,  ఫోన్నుఅన్లాక్ చేయడానికి వినియోగదారులు ఈ ప్రాంతములో వారి వేలుతో నొక్కాల్సివుంటుంది. ఇప్పుడు, Xiaomi  ఒక కొత్త టెక్ పురోగతితో మరియు ఒక కొత్త వీడియోతో టీజ్ చేస్తోంది, సంస్థ యొక్క అధ్యక్షుడు మరియు సహ వ్యవస్థాపకుడు అయిన, లిన్ బిన్ డిస్ప్లే  యొక్క విశాల ప్రాంతం క్రింద పొందుపరచబడి ఉన్న డిస్ప్లేలోవున్నాఫింగర్ ప్రింట్  సెన్సార్ ఉపయోగించే, ఒక నమూనా స్మార్ట్ ఫోన్ను ప్రదర్శించారు.

లిన్ బిన్, ఈ వీడియోను వైబోలో పోస్ట్ చేసారు మరియు ఈ పోస్ట్ శీర్షిక ప్రకారం అన్లాకింగ్ ప్రాంతం 50.2 మిమీ x 25 మిమీ గా సూచిస్తుంది, ఇది "ప్రస్తుత మార్కెట్లోవున్న  ప్రధాన మొబైల్ ఫోన్ల యొక్క అన్లాకింగ్ ప్రాంతం కంటే చాలా రెట్లు పెద్దది" అని చెప్పబడింది. వీడియో ద్వారా పరిశీలిస్తే, డిస్ప్లేలో ఉన్నపెద్ద వేలిముద్ర సెన్సార్ ప్రాంతం బాగా పనిచేస్తుంది మరియు ఫోన్ను అన్లాక్ చేయడానికి వేగంగా కూడా ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు, ఇందులో ఈ వేలిముద్ర సెన్సార్ ఫోన్నుఎలా అన్లాక్ చేస్తుందని కూడా చూపించారు. ఈ వీడియో డెమోలో ఉపయోగించిన ప్రోటోటైప్ ఫోన్ Mi 8 వలనే కనిపిస్తుంది కానీ ఈ టెక్ షావోమి డివైజ్లకు తీసుకొచ్చేటప్పుడు, ప్రధాన ఫోన్ల కోసం మాత్రమే రిజర్వ్ చేయబడుతుందో లేదో చూడవచ్చు.

Xiaomi MI 8 Pro,  డిస్ప్లేలో ఒక వేలిముద్ర సెన్సార్ తో తీసుకొచ్చిన సంస్థ యొక్క మొదటి ఫోన్. ఇన్-డిస్ప్లే సెన్సార్ అనేది ప్రధానంగా ఒక CMOS సెన్సార్, ఇది డిస్ప్లే కింద ఉంచబడుతుంది మరియు డివైజ్ ను అన్లాక్ చేయడానికి కాంతిని ప్రతిబింబిస్తుంది, తద్వారా వేలిముద్రను గుర్తించగలుగుతుంది. ఈ సెన్సారును ఈవిధంగా చేయవచ్చు, సిద్ధాంతపరంగా,  ఏదైనా ఆకారం మరియు పరిమాణంలో ఉండేలా మరియు సెన్సార్ యొక్క కొలతలు మార్చేలా భాగస్వామ్యం చేయడం ద్వారా, ఈ సంస్థ చాలా విస్తృతంగా ఉన్న ఒక సెన్సార్ను ఉపయోగిస్తుందని సూచిస్తుంది. అయితే, ఇది పూర్తిగా డిస్ప్లేని కవర్ చేసేలా చేయగలిగే సామర్థ్యం మాత్రం లేదు. అయితే, రోజురోజుకు పెరుగుతున్న పోటీ మధ్య,  మొత్తం డిస్ప్లేలో వేలిముద్ర సెన్సార్ ప్యాక్ చేయడాన్ని మరెవరైనా చేయొచ్చని అంచనా వేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :