Xiaomi నుంచి నవంబర్ 2 న ఇండియాలో కొత్త సెల్ఫీ -సెంట్రిక్ స్మార్ట్ఫోన్ లాంచ్ అవుతుంది ,దీనిని Mi Note 3 అని అంటున్నారు . నవంబర్ 2 న భారతదేశంలో Xiaomi సెల్ఫీ -సెంట్రిక్ స్మార్ట్ఫోన్ యొక్క ఒక కొత్త సిరీస్ ని విడుదల చేస్తుంది. టీజర్ లో ఒక లైటింగ్ సింబల్ కూడా ఉంది, రాబోయే డివైస్ ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతిస్తుందని సూచిస్తుంది. Xiaomi కూడా వివో, Oppo మరియు జియోని వంటి కంపెనీ ల మాదిరిగా మంచి సెల్ఫీ కెమెరా ఇవ్వడానికి ఆలోచిస్తున్నట్లు సూచించింది.ఒక ట్వీట్లో, Xiaomi ఇండియా యొక్క మేనేజింగ్ డైరెక్టర్ Manu Jain మాట్లాడుతూ, 'బెస్ట్ సెల్ఫ్టీ కెమెరా' స్మార్ట్ఫోన్ ని ప్రవేశపెట్టడానికి కంపెనీ అనేక అద్భుతమైన ప్రణాళికలను కలిగి ఉంది. Xiaomi నుంచి ఒక బెస్ట్ సెల్ఫీ కెమెరా తో మొదటిసారి స్మార్ట్ఫోన్ ని ప్రారంభించబోతుందని తెలిపారు.Xiaomi చివరకు భారతదేశం లో దాని Mi నోట్ సిరీస్ ప్రారంభించనున్నట్లు టీజర్ చూపిస్తుంది, గత నెలలో చైనాలో మి మిక్స్ 2 తో మి నోట్ 3 లాంచ్ అయ్యింది . ఈ స్మార్ట్ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 చిప్సెట్ కలిగివుంది. మి నోట్ 3 స్మార్ట్ఫోన్ 6GB RAM మరియు 64GB / 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.Mi నోట్ 3 12MP డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ కలిగి వుంది . 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.Xiaomi మి నోట్ 3 ఒక బెజిలెస్ డిజైన్ ఫోన్ కాదు. ఫోన్ ముందు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. హ్యాండ్సెట్ యొక్క బ్యాటరీ 3500mAh మరియు Qualcomm క్విక్ ఛార్జ్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది . Mi నోట్ 3 స్మార్ట్ఫోన్ ధర 2,499 యువాన్ (సుమారు 25,000 రూపాయలు)నుంచి మొదలవుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్స్ పై Flipkart లో ఆఫర్స్