అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది అని xiaomi కొత్త యాడ్ పోస్ట్ చేసింది.

అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది అని xiaomi కొత్త యాడ్ పోస్ట్ చేసింది.

చైనీస్ మొబైల్ దిగ్గజం,  xiaomi  తాజగా ఒక టీసర్ ను రిలీజ్ చేసింది ఇంటర్నెట్ లో. ఇది చైనీస్ వెబ్ సైట్ Weibo లో ఉంది. జీవితంలో అన్నీ ఇంపార్టెంట్ ప్రశ్నలకు సల్యుషణ్ ఇస్తుంది అని ఆ యాడ్ లో చెప్పింది Xiamoi.

పోస్ట్ చేసిన ఇమేజ్ లో 100 చైనీస్ కరెన్సీ(Yuan) నోటు కాగితాలు ఉన్నాయి. ఇమేజ్ ప్రకారం చూస్తుంటే కంపెని చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బులు చూపించి అందరికీ సల్యుషణ్ ఇస్తుంది అంటే ..

… బహుసా xiaomi ప్రస్తుత మోడల్స్ అన్నీ ధరలు తగ్గుతాయేమో అని అంచనాలు మొదలవుతున్నాయి. లేదా చాలా తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉండే బడ్జెట్ సెగ్మెంట్ లో కొత్త ప్రోడక్ట్ (స్మార్ట్ ఫోన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి) లాంచ్ చేస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

గతంలో డిజిట్ టైమ్స్ "xiaomi త్వరలో మనీ లోన్ ఇచ్చేందుకు కొత్త కంపెని పెట్టబోతుంది" అని వెల్లడించింది. స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించి 3,12,852 రూ వరకూ కంపెని లోన్ ఇవనున్నట్లు రిపోర్ట్స్. 

అయితే ఇది కేవలం xiaomi బ్రాండ్ ఫోనులు వాడుతున్న వారికేనా లేక స్మార్ట్ ఫోన్ వాడే అందరికీ ఇస్తుంద అని ఇంకా తెలియదు. ఇది కనుక నిజం అయితే xiaomi లేటెస్ట్ టీసర్ యాడ్ దీనికి సంబంధించి అయి ఉండాలి.

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo