Xiaomi మి 4i హీటింగ్ సమస్యలకు సాఫ్టవేర్ అప్డేట్ రిలీజ్
Xiaomi కంపెని తన మి 4i వినియోగదారులకు OTA అప్డేట్ ద్వారా హీటింగ్ సమస్యలను నుండి విముక్తి ఇచ్చే ప్రయత్నం చేసింది.
మేము రీసెంట్ గా మి 4i పై రివ్యూ చేసాము, కంపెని చెప్పినంత పెర్ఫార్మెన్స్ లేదు ఈ ఫోన్ లో. అందుకు ప్రధాన కారణం ఫోన్ వేడెక్కటమే. బహుశా ఈ విషయాన్ని Xioami సీరియస్ గా తీసుకున్నట్టుంది. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు కొత్త OTA అప్డేట్ ఒకటి రిలీజ్ చేసింది. MIUI v6.5.5.0 LXIMICD పేరు తో విడుదలైన అప్డేట్ ప్రస్తుతానికి కొంతమందికి మాత్రమే లభిస్తుంది, త్వరలో అందరికి రిలీజ్ చేయనుంది.
అయితే గతంలో కూడా కంపెని ఇలానే ఒక అప్డేట్ ను విడుదల చేసింది. కాని అది పాత సమస్యలను ఫిక్స్ చేయటం సంగతి పక్కన పెడితే, కొత్త సమస్యలను తీసుకు వచ్చింది, కాని Xiaomi వెంటనే మరో అప్డేట్ ద్వారా ఆ ఇబ్బందులను తొలిగించింది.
మి 4i హీటింగ్ ఇష్యూ కు సంబంధించి Xiaomi వైస్ ప్రెసిడెంట్ ఫేస్బుక్ లో "కొత్త అప్డేట్ లో టెంపరేచర్ కు అనుగుణంగా కోర్స్, ఫ్రిక్వేన్సి ను అడ్జెస్ట్ చేసే కొత్త అల్గారిథంస్ దీనిలో జోడించాం" అని పోస్ట్ చేసారు. డెవెలపర్ టెస్టింగ్ లో ఈ అప్డేట్ మంచి పెర్ఫార్మెన్స్ ను ప్రదర్శిస్తుంది అని కూడా చెప్పారు వైస్ ప్రెసిడెంట్.
ప్రస్తుతానికి Xiaomi మి 4i ఎటువంటి రిజిస్ట్రేషన్స్ లేకుండా డైరెక్టుగా ఫ్లిప్ కార్ట్ లో దొరుకుతుంది.
Hardik Singh
Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile