షావోమి యొక్క రెడ్మి నోట్ 7 ఇండియాలో ఫిబ్రవరి 12 న విడుదలకానుంది : రిపోర్ట్

Updated on 01-Feb-2019
HIGHLIGHTS

ఇటీవలే, షావోమి మరియు రెడ్మి ఇండియా కూడా ఈ రెడ్మి నోట్ 7 యొక్క ఇండియా లాంచ్ గురించి టీజ్ చేసాయి.

షావోమి మరియు రెడ్మి రెండు కూడా వారి భారతీయ సోషల్ మీడియా ఖాతాలలో ఒక 48MP కెమెరా సెటప్ గల నోట్ 7 యొక్క ఇండియా లాంచ్ గురించి టీజింగ్ చేశారు. గత వారం, ఈ టీజర్స్ వచ్చాయి కానీ మార్కెట్ వాగ్దానం కోసం, ఈ ఫోన్ల యొక్క ఖచ్చితమైన లాంచ్ డేట్ చెప్పలేదు. అయితే, ఫిబ్రవరి 12 న ఇండియాలో  పుకార్లలో వున్న ఈ రెడ్మి నోట్ 7 ను ప్రారంభించనున్నట్లు, ఒక లాంచ్ ఈవెంట్ సేకరించినట్లు 91mobiles పేర్కొంది.

షావోమి  మరియు రెడ్మి ట్వీట్ చేసిన వ్యాఖ్యల ప్రకారం,  రెడ్మి నోట్ 7 ఫిబ్రవరి 14 న భారతదేశంలో ప్రారంభించవచ్చని సూచనప్రాయంగా తెలుస్తోంది. ఎందుకంటే, గత సంవత్సరం అదే తేదీన రెడ్మీ నోట్ 5 ప్రో ను భారతదేశంలో ప్రవేశపెట్టిన కారణంగా ఇది నిజంకావచ్చని అనిపిస్తోంది . రెడ్మి నోట్ 7యొక్క 3GB + 32GB వేరియంట్  చైనాలో 999 యువాన్ వద్ద ప్రారంభమవుతుంది (సుమారు 10,000 రూపాయలు). అలాగే, 4GB + 64GB వేరియంట్ ధర 1199 యువాన్ (సుమారు రూ .12,500) మరియు 6GB + 64GB వేరియంట్ 1399 యువాన్లకు రిటైల్ చేయబడయింది, ఇది దాదాపు రూ .14,500 ధరకు సమానం.

రెడ్మి నోట్ 7 ప్రత్యేకతలు

డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఈ రెడ్మి నోట్ 7,  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల LCD ప్యానెల్ తోవస్తుంది.  ఒక 450 nits బ్రైట్నెస్ తో కేవలం 0.8mm మందపాటి bezelsను కలిగిఉంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC కి జతగా  3GB, 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 32GB లేదా 64GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.

పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా 5MP సెకండరీ సెన్సారుతో కలిపి 48MP సెన్సారు కలిగిన మొదటి Redmi ఫోన్ ఇది. ఈ నోట్ 7 యొక్క 48MP సెన్సార్ తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుందిని  కంపెనీ పేర్కొంది. ఈ  48MP కెమెరా సెన్సార్ 1/2-అంగుళ పరిమాణాన్నికలిగి స్మార్ట్ ఫోన్లలో అందంగా పెద్దదిగా ఉంటుందిని సోనీ సంస్థ  వెల్లడించింది. ఇందులో అతితక్కువ 0.8um అంగుళాల పిక్సెళ్ళు నిజంగా బాగుంటుంది, కెమెరా సెన్సార్లో 48 మెగాపిక్సెళ్లను క్రామ్ చేయగలిగింది. Xiaomi ప్రకారం, Redmi Note 7 పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదని చెబుతోంది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :