షావోమి తరువాతి తరం స్మార్ట్ ఫోన్లగా ఆరోపిస్తున్న రెడ్మి7,రెడ్మి7A మరియు రెడ్మి7 ప్రో 3C ధ్రువీకరణ పొందాయి.

షావోమి తరువాతి తరం స్మార్ట్ ఫోన్లగా ఆరోపిస్తున్న రెడ్మి7,రెడ్మి7A మరియు రెడ్మి7 ప్రో 3C ధ్రువీకరణ పొందాయి.
HIGHLIGHTS

ధ్రువీకరణ పొందిన ఈ మోడళ్ళు M1901F7E, M1901F7T మరియు M1901F7C గా జాబితా చేయబడ్డాయి మరియు ఒక 10W చార్జరుతో వచ్చే అవకాశం.

షావోమి, సెప్టెంబర్  నెలలలో తన ఆరవ తరం ఫోనులయినటువంటి రెడ్మి6, రెడ్మి6A, మరియు రెడ్మి6 ప్రో స్మార్ట్ ఫోన్లను ఇండియాలో విడుదలచేసింది. ఇప్పుడు, కేవలం మూడు నెలల వ్యవధిలోనే దేనికి తరువాతి లైన్ అప్ ని తీసుకురానున్నట్లు ఆరోపిస్తున్న స్మార్ట్ ఫోన్ల యొక్క అవసరమైన ధ్రువీకరణ పత్రాన్నిపొందింది చైనాలో. ఒక నివేదిక ప్రకారం, M1901F7E, M1901F7T మరియు M1901F7C – మూడు మోడళ్ళు కూడా 3C ద్రువీకరణను పొందాయి మరియు ఇవి ఒక 10W చార్జరుతో వెబ్ సైటులో జాబితా చేయబడ్డాయి.        

పేరు నమోదు చేయబడని ఈ మూడు మోడళ్ళ స్మార్ట్ ఫోన్లను రెడ్మి 7, రెడ్మి 7A మరియు రెడ్మి 7 ప్రో అని నామకరణం  చేయవచ్చు.  ఎందుకంటే, 6 వ తరం లైన్ అప్ లో  'నోట్' మరియు 'ప్రో' ఇప్పటికే విడుదలచేసింది కాబట్టి, ఇలా జరగడానికి అవకాశముంది. ఉదాహరణకి, రెడ్మి 6 సిరీస్ ఫోన్లు బాక్సులో 10W చార్జరుతో కలిపి  వచ్చినట్లయితే కనుక తరువాతి తరం స్మార్ట్ ఫోన్లు తయారీలో ఉన్నట్లు సూచనప్రాయంగా తెలుస్తుంది. 3C వెబ్ సైట్ జాబితా ప్రకారం, 10W చార్జరు మరియు ఒకేవిధమైన ఒక మూడు కొత్త మోడళ్ల నంబర్లు అన్ని కలగలిపి, రెడ్మి 7 సిరీస్ యొక్క రాకను తెలియచేస్తున్నాయి.

ఇంకా, 3C సర్టిఫికేషన్ వెబ్ సైటులో మరొక రెండు కొత్త మోడల్లైనటువంటి M1901F9E మరియు M1901F9T లు కూడా కనిపించాయి.  వచ్చిన ఊహాగానాలను నిజమని నమ్మితే కనుక, ఈ రెండు మోడళ్ళు కూడా రెడ్మి నోట్ 6 కావచ్చు.  దీనినే భారతదేశంలో విడుదలచేసిన షావోమీ రెడ్మి నోట్ 6 ప్రో గా భారతదేశంలో విడుదలచేసారు మరియు ఈ స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదల చేయబడలేదు. ఇవన్నీకూడా గమనిస్తే, కంపెనీ యొక్క సొంత గడ్డపైన వీటిని మొదటగా  ప్రకటించే అవకాశమున్నట్లు అర్ధమవుతుంది. మరొక ముఖ్య విషయమేమిటంటే, ఈ సంవత్సరం విడుదలైన అన్ని ఫోన్లు కూడా M18 తో ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ ఫోనాలను 2019 లో విడుదల చేయవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo