షావోమి రెడ్మి నోట్ 7 ని ఫిబ్రవరి 28న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త విషయమేమిటంటే, ఈ స్మార్ట్ ఫోనుతో పాటుగా, రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి గో స్మార్ట్ ఫోన్ను కూడా ప్రకటించినున్నట్లు భావిస్తున్నారు. రెడ్మి నోట్ 7 ప్రో వచ్చే వారం చైనాలో ఆరంభమవుతుందని రెడ్మి ప్రెసిడెంట్ లియు వీబింగ్ ధ్రువీకరించారు. ఈ న్యూస్ వీబింగ్ యొక్క ,వెయిబో పోస్ట్ ద్వారా అందించబడింది, ఇది రాబోయే ఫోన్ యొక్క చిత్రంతో ఉంటుంది. రెడ్మి నోట్ 7 ప్రో, ఆశ్చర్యకరంగా ,చూడడానికి అచ్చంగా రెడ్మి నోట్ 7 ని పోలి ఉంది. కానీ ఇందులో మేనకు ఇప్పటికే తెలిసిన, శామ్సంగ్ GM1 సెన్సార్ కి బదులుగా 48MP సోనీ IMX586 సెన్సార్ అమర్చారు.
రెడ్మి నోట్ 7 ప్రో గురించి మునుపటి నివేదికలు అది స్నాప్డ్రాగన్ 675 SoC తో నడుస్తుంది అని సూచిస్తున్నాయి. Weibing, తన ముందు Weibo పోస్ట్ లో, వినియోగదారులు రెడ్మి నోట్ 7 ప్రో లో ఏమి చూడాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. దానికి ఒక వినియోగదారుడు,3/32GB వంటివి వదిలేసి, 6/64 GB లేదా 6/128 GB కోసం నేరుగా వెళ్లండి అని బదులిచ్చాడు. రెడ్మి ప్రెసిడెంట్, దీనికి స్పందిస్తూ, 6GB RAM, 128GB స్టోరేజి ఎంపిక రెడ్మి నోట్ 7 ప్రో లో లభ్యమవుతుందని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇంటర్నెట్లో, చక్కర్లు కొడుతున్నవదంతుల ప్రకారం, చైనా కంపల్సరీ సర్టిఫికేట్ (3C) వెబ్ సైట్లో కనిపించినప్పటి నుండి ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుందని సూచిస్తున్నాయి.
వెయిబింగ్ గతంలోనే ఈ రెడ్మి నోట్ 7 ప్రో, Mi 9 తర్వాత అధికారికంగా విడుదల చేయబడుతుందని సూచించింది, ఇది ఫిబ్రవరి 20 న ప్రారంభించబడింది. కంపెనీ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇక Mi 9 గురించి మాట్లాడుతే, సంస్థ మి 9 ట్రాన్సపరెంట్ ఎడిషన్ మరియు మి 9 SE తో ఈ ఫోన్ను ప్రకటించింది.