షావోమి రెడ్మి నోట్ 7 ప్రో : 48MP సోనీ IMX586 సెన్సారుతో ఈ ఫోన్ కోసం పనిచేస్తోంది

Updated on 11-Jan-2019
HIGHLIGHTS

రాబోయే ఈ డివైజులో ఒక 48MP సోనీ IMX586 సెన్సారుని అమర్చవచ్చు.

ముఖ్యాంశాలు:

1. షావోమి ఇటీవల ప్రకటించిన రెడ్మి నోట్ 7 యొక్క ప్రో వేరియంట్ కోసం పనిచేస్తున్నట్లు తెలిపింది.

2. రాబోయే ఈ డివైజులో ఒక 48MP సోనీ IMX586 సెన్సారుని అమర్చవచ్చు.

3. ఇటీవల ప్రకటించిన రెడ్మి నోట్ 7 శామ్సంగ్ యొక్క ISOCELL Bright GMI 48MP సెన్సార్ తో వస్తుంది.

షావోమి మరియు రెడ్మి ఇటీవల విడిపోయారు, అయితే , నిజంగా విడిపోవడంకాదు కానీ, బదులుగా షావోమి రెడ్మి అని  ఉండదనమాట.  వారు ఇప్పుడు రెండు ప్రత్యేక సంస్థలుగా, అలాగే Xiaomi యొక్క ఒక పూర్తి స్థాయి ఉప బ్రాండ్ గా Redmi ఉంటుంది. ఈ కొత్త Redmi బ్రాండ్ తో కంపెనీ ఇటీవలే తన నోట్ 7  స్మార్ట్ ఫోన్నుఒక 48MP వెనుక కెమెరాతో తీసుకొచ్చింది. ఇది 999 యువాన్ (సుమారు 10,341 రూపాయలు) వద్ద ఆశ్చర్యకరంగా చాలా సరసమైనది స్మార్ట్ ఫోనుగా మార్కెట్లోకి వచ్చింది. అయినప్పటికీ, ఆండ్రాయిడ్ అథారిటి సంస్థ కూడా ఈ హ్యాండ్సెట్ యొక్క ప్రో వేరియంట్ అభివృద్ధిలో ఉంది అని ప్రకటించింది మరియు ఇది  రెడ్మి నోట్ 7 లో ఉపయోగించిన దాని కంటే విభిన్నమైన 48MP సెన్సార్ను కలిగి ఉంటుంది. ఈ కంపెనీ, 48MP సోనీ IMX586 సెన్సర్ని రాబోయే Redmi Note    7 Pro  స్మార్ట్ ఫోనులో తీసుకురానున్నట్లు, గత సంవత్సరం జూలై లో సోనీ ప్రకటించింది.

ప్రస్తుత రెడ్మి నోట్ 7, శామ్సంగ్ ISOCELL Bright GMI 48MP సెన్సార్ కలిగి ఉండనున్నట్లు చెప్పబడింది. అయితే, సోనీ యొక్క 48MP సెన్సార్ క్వాడ్-బేయర్ రూపకల్పనతో కూడిన ఒక CMO విభాగంతో ఉన్న స్పష్టత మరియు తక్కువ కాంతి ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని అందించబడుతుంది. ఇది పరిమాణంలో 1/2 అంగుళాలు ఉంటుంది, ఇది స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే సాంప్రదాయిక ఇమేజింగ్ సెన్సార్ల కంటే పెద్దది. ప్రతి పిక్సెల్, సోనీ సెన్సారు పైన  0.8μm ని కొలుస్తుంది మరియు ప్రక్కనే పిక్సెల్స్ కలపడం ద్వారా, చివరి అవుట్పుట్ యొక్క సమర్థవంతమైన పిక్సెల్-పిచ్ 1.6μm ఉంటుంది. ఈ సోనీ సెన్సార్, ఇటీవల ప్రకటించిన హానర్ వ్యూ 20 స్మార్ట్ ఫోనులో కూడా ఉపయోగించబడింది.

రెడ్మి నోట్ 7 ప్రో,  రానున్న చైనీస్ న్యూ ఇయర్ సమయంలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. రెడ్మినోట్ 7 ని, దానికి ముందున్న వాటితో  పోలిస్తే గణనీయమైన అప్డేట్ గా చెప్పవచ్చు. 2340×1080 పిక్సెల్స్తో కూడిన ఒక 6.3-అంగుళాల ఎల్సిడి డిస్ప్లేలో వాటర్ డ్రాప్  నోచ్ తో ఈ పరికరం వస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 SoC చేత శక్తినిచ్చింది మరియు 32GB మరియు 64GB స్టోరేజి ఎంపికలతో 3GB, 4GB మరియు 6GB RAM రకాల్లో లభిస్తుంది. ఇది 4000mAh బ్యాటరీతో మద్దతు ఇస్తుంది మరియు మైక్రో -USB కి బదులుగా త్వరిత ఛార్జ్ 4.0 మద్దతుతో ఒక USB టైప్-సి పోర్ట్ను కలిగి ఉంది.

ఇక ఈ డివైజ్ హైలైట్స్ వద్దకి చేరుకుంటే, అది 48MP సెన్సార్ను కలిగి ఉన్న మొట్టమొదటి Redmi ఫోన్. ఈ ప్రధాన సెన్సార్ పోర్ట్రైట్ షాట్లను సాధించే 5MP సెకండరీ సెన్సారుతో అనుబంధించబడుతుంది. ముందు, ఇది 13MP కెమెరాను కలిగి ఉంటుంది, ఇది  ఫేస్ బ్యూటిఫికేషన్ మరియు పోర్ట్రైట్ రీతి మోడ్ షాట్లని తీయడం కోసం AI- ఆధారిత ఆల్గోరిథమును ఉపయోగించుకుంటుంది. రెడ్మి నోట్ 7 యొక్క 3GB  + 32GB మోడల్ ధర 999 (సుమారు 10,381 రూపాయలు), దాని 4GB + 64GB మోడల్ 1199 యువాన్ (రూ .12,455 సుమారు) ధరతో ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ మరొక వేరియంట్ అయినటువంటి  6GB + 64GB మోడల్ 1399 యువాన్ (సుమారు రూ .14,532) ధరతో  వస్తుంది. ఒకవేళ, భారతదేశంలో విడుదలచేసినట్లయితే, ఎటువంటి ధరతో తీసుకువస్తుందో, తెలుసుకోవడానికి వేచిచూడాల్సిందే.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :