జనవరి లో చైనాలో రిలీజ్ అయిన Xiaomi రెడ్మి నోట్ 3 ఈ రోజు ఇండియాలోరెండు వేరియంట్స్ లో రిలీజ్ అయ్యింది. 16GB స్టోరేజ్ ప్రైస్ – 9,999 రూ, 32GB స్టోరేజ్ ధర 11,999 రూ.
ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్స్ మొదలు అవుతున్నాయి. మొదటి ఫ్లాష్ సేల్ మార్చ్ 9 న మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఫోన్ Mi.com మరియు అమెజాన్ లో మాత్రమే సేల్ అవనుంది.
స్పెసిఫికేషన్స్ – 5.5 in IPS 1920x1080P ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 650 hexa కోర్ SoC ఫోర్ కోర్స్ 1.2ghz, మరో రెండు కోర్స్ 1.8ghz క్లాక్ స్పీడ్ కలిగి ఉన్నాయి. ఈ ప్రొసెసర్ ఇండియాలో మరే ఇతర ఫోన్లో లేదు.
రెండూ ఆండ్రాయిడ్ లాలీ పాప బేస్డ్ MIUI 7 పై రన్ అవుతాయి. అడ్రెనో 510GPU, 16GB స్టోరేజ్ తో 2GB ర్యామ్ వేరియంట్ అండ్ 32GB స్టోరేజ్ తో 3gb ర్యామ్ వేరియంట్. రెండూ డ్యూయల్ 4G సిమ్ స్లాట్స్ తో మెటల్ బాడీ కలిగి ఉన్నాయి.
16MP రేర్ కెమేరా with డ్యూయల్ led ఫ్లాష్ with ఆటో ఫోకస్, 5MP ఫ్రంట్ కెమేరా, 4050 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, బ్యాక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ( 5 ఫింగర్ ప్రింట్స్ ).
డార్క్ గ్రే, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ తో అందుబాటులోకి వస్తున్నాయి రెండు వేరియంట్స్. రెడ్మి నోట్ 3 తో పాటు 1,999 రూ లకు కంపెని Mi బ్లూ టూత్ స్పీకర్ లాంచ్ చేసింది.
కంపెని Mi 5 లాంచ్ చేసింది రీసెంట్ గా. అయితే ఇది ఇండియాలోకి రావటానికి కొంచెం టైమ్ పట్టేలా కనిపిస్తుంది. ఎందుకంటే కంపెని హెడ్ ను ఇండియన్ రిలీజ్ డేట్ పై అడిగితే ఇంకా ప్లాన్ చేయలేదు అని బదులిచ్చారు.
Mi 5 టోటల్ స్పెక్స్ ఈ లింక్ లో చూడగలరు.
రెడ్మి నోట్ 3 మిగిలిన ఫోనులతో స్పెక్స్ కంపేర్ చేసి తెలపటం జరిగింది ఈ లింక్ లో.