షియోమి తన రెడ్ మి నోట్ 12 సిరీస్ నుండి మరొక స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. Redmi Note 12 స్మార్ట్ ఫోన్ ను మార్చి 30న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది మరియు టీజింగ్ కూడా మొదలుపెట్టింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ గురుంచి వెల్లడించడం మొదలు పెట్టింది. మరి షియోమి లాంచ్ చేయనున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్లతో రాబోతోందో ఒక లుక్కేద్దామా.
ఈ ఫోన్ యొక్క లాంచ్ మరియు టీజ్డ్ స్పెక్స్ గురించి కంపెనీ వెల్లడించింది. Flipkart ఈ ఫోన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. mi.com మరియు Flipkart మైక్రో సైట్ పేజ్ ద్వారా ఈ ఫోన్ గురించి కంపెనీ టీజ్డ్ స్పెక్స్ ను అందించింది. దీనిద్వారా, ఈ షియోమి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలను పరిశీలిద్దామా.
Redmi Note 12 స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన SuperAMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే ఎగువ భాగం మధ్యలో పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది మరియు ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ రెడ్ మి నోట్ 12 సిరీస్ నుండి ముందుగా వచ్చిన స్మార్ట్ ఫోన్ల కంటే డిఫరెంట్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ ఫాస్ట్ 4G ప్రాసెసర్ Snapdragon 685 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. జతగా, వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో టోటల్ 11GB ర్యామ్ ఈ ఫోన్ కలిగి ఉంటుందని, కంపెనీ చెబుతోంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమేరా మరియు జతగా LED ఫ్లాష్ తో వుంది. ఇది 50MP మైన్ కెమేరాకి జతగా మరో రెండు కెమెరాలతో ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వస్తుందని కూడా షియోమి టీజింగ్ ద్వారా తెలిపింది.