రెడ్మి నోట్ 7 లాంచ్ : ఇండియాలో 48MP కాదు 12MP మాత్రమే.
రెడ్మి నోట్ 7 విడుదల కోసం ఎదురుచూస్తున్న వారికి చేదు వార్త .
అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్ ఈరోజు విడుదలయ్యింది. ముందుగా,చైనాలో విడుదల చేయబడిన ఫోన్ వెనుక ఒక 48MP ప్రధాన కెమెరాతో విడుదలైయ్యింది. కానీ, ఇండియాలో రెడ్మి నోట్ 7 ఫోన్ను కేవలం 12MP కెమేరాతో మాత్రమే అందించింది. రెడ్మి నోట్ 7 యొక్క సాధారణ వేరియంట్ అయినటువంటి, 3GB/32GB వేరియంట్ రూ. 9,999 ధరతో ప్రారంభమవుతుంది. రెడ్మినోట్ 7 స్మార్ట్ ఫోన్, Flipkart మరియు mi.com నుండి మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి మొదటి సరిగా అమ్మకానికి రానుంది.
రెడ్మి నోట్ 7 ధర
1. రెడ్మి నోట్ 7 – 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ : రూ. 9,999
2. రెడ్మి నోట్ 7 – 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ : రూ. 11,999
రెడ్మి నోట్ 7 ప్రత్యేకతలు
ఈ రెడ్మి నోట్ 7 , డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో 2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల డిస్పల్ తోవస్తుంది. ఒక 450 nits బ్రైట్నెస్ ను కలిగిఉంది. ఈ ఫోన్ 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో కూడా @5వ తారం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని అందించారు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 SoC కి జతగా 3GB మరియు 4GB RAM వేరియంట్లలో 32GB మరియు 64GB స్టోరేజిలలో లభిస్తాయి. ఒక 4,000 mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది.
రెడ్మి నోట్ 7 స్మార్ట్ ఫోన్, పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 2MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన ఒక ప్రధాన 12MP సెన్సారు కలిగి ఉంటుంది. ముందుగా, చైనాలో విడుదల చేసిన విధంగా, ఈ నోట్ 7 ఒక 48MP కెమేరాతో అందించబడుతుందని, అందరూ ఎదురు చూస్తుండగా, సంస్థ మాత్రం దీన్ని ఒక 12MP ప్రధాన కెమెరాతో విడుదల చేసింది. ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్ మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.