Xiaomi Redmi 5A లాంచ్, భారత్ లో అతి పెద్ద హిట్ అవ్వబోతుందా .

Updated on 17-Oct-2017

కొంతకాలం  నుంచి ఎన్నో లీక్స్  తరువాత, Xiaomi  తన Redmi 5A  కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ ని  ప్రారంభించింది, Xiaomi  కొన్ని రోజుల నుంచి Redmi 5A, యొక్క టీజర్ కూడా రెడీ చేస్తుంది . 

ఇటీవలే విడుదలైన పోస్టర్ లో  తెలిసిన విషయం  ఏమిటంటే ఈ కొత్త స్మార్ట్ఫోన్ 8 రోజుల లాంగ్  బ్యాటరీతో  వస్తుంది . ఇదే  కాకుండా, ఈ స్మార్ట్ఫోన్ MIUI 9 తో వస్తుంది , ఫోన్ యొక్క విడుదల తేదీ ఇంకా ఖరారు  చేయలేదు.

ఇప్పుడు షియోమీ  యొక్క ఈ స్మార్ట్ ఫోన్ అధికారికంగా మారింది. అదే సమయంలో, Redmi 5A  కొన్ని ప్రత్యేక లక్షణాలతో వస్తుంది. ఫోన్ యొక్క స్పెక్స్ మరియు విశేషాల వివరాలను తెలుసుకోండి.

Redmi 4A ఒక ప్లాస్టిక్ బాడీ  కలిగి ఉండగా ,రెడ్మీ 5A ఒకటి మెటల్ బాడీ తో వస్తుంది .  మెటల్ బాడీ  ఉన్నప్పటికీ, ఈ కొత్త ఫోన్ చాలా తేలికైనది. అయితే, దానిలో ఫింగర్ ప్రింట్  సెన్సార్ లేదు. 5 అంగుళాల HD 720p  డిస్ప్లే  Redmi 5A స్మార్ట్ఫోన్ లో  అందించబడింది మరియు 1.2GHz క్వాడ్ కోర్ 64 బిట్ స్నాప్డ్రాగెన్ 425 SOC తో వస్తుంది.  2 GBRAM ఉంటుంది,  ఇంటర్నల్  మెమరీ 16 GB ,  128 GB కు  ఎక్స్ పాండబుల్ . 

దీనిలో 3000 mah బ్యాటరీ  గలదు ,13ఎంపీ రేర్ కెమెరా దీనిలోLED ఫ్లాష్ అండ్  PDAF ఇవ్వబడింది . ఫ్రంట్ కెమెరా 5ఎంపీ . రెడ్మీ  5A ధర  599 యువాన్ అంటే సుమారు  5,900 రూ. గా ఉంటుంది . మీరు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో  ఈ డివైస్ ని  కొనుగోలు చేయవచ్చు. సెల్ ఫోన్ అక్టోబర్ 17  అనగా ఈరోజు  ఉదయం 10 గంటలకు  ప్రారంభమవుతుంది. ఇది మి మాల్, మీ హోమ్, మీ స్టోర్ మొదలైన వాటిలో కనిపిస్తుంది. 

 

Connect On :