Xiaomi Redmi 5A కు రిలయన్స్ Jio కనెక్షన్ పై రూ. 1000 క్యాష్బ్యాక్

Updated on 04-Dec-2017

జియో షియోమీ తో పార్టనర్ షిప్ తో లేటెస్ట్ గా లాంచ్ అయిన  Redmi 5A  బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పై  Rs 1000  క్యాష్  బ్యాక్ ని ఆఫర్ చేస్తుంది . Redmi 5A యొక్క  2GB RAM అండ్ 16GB స్టోరేజ్ వెర్షన్ ధర  Rs 5999 అండ్  3GB RAM అండ్ 32GB స్టోరేజ్ వెర్షన్ ధర  Rs 6999 . అయితే షియోమీ 2GB/16GB వెర్షన్ ధర పై Rs 1000 డిస్కౌంట్ ఇస్తుంది కానీ  ఈ ఆఫర్ కేవలం  5 మిలియన్ యూజర్స్ కి మాత్రమే . 

ఒకవేళ యూజర్ జియో కనెక్షన్ తో  ఈ ఫోన్ కొంటె  Rs 1000 వరకు క్యాష్  బ్యాక్ లభిస్తుంది . ఈ ఆఫర్ తో పాటుగా  Redmi 5A యొక్క 2GB/16GB వెర్షన్ Rs 3,999 లో కొనవచ్చు . ఈ ఆఫర్ తో పాటుగా Redmi 5A  చవక ధర లో బెస్ట్ స్పెక్స్ కలిగి వుంది . ఎప్పటిలాగే, జియో యొక్క క్యాష్ బ్యాక్ ఆఫర్తో కొన్ని షరతులు ఉన్నాయి. జియో రెడ్మి 5 ఎ రెండు వేరియంట్స్ పైనా  క్యాష్బ్యాక్ అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ను జియో కనెక్షన్తో కొనుగోలు చేసే వినియోగదారులకు 1,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది, అయితే వినియోగదారులు 12 నెలల వరకు  రు .199 రీఛార్జ్ చేయ వలసి ఉంటుంది.

ఉచిత నేషనల్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా (రోజుకు 1GB FUP) మరియు SMS కి జియో రీఛార్జ్ రూ 199 లలో లభిస్తాయి, ఈ ఆఫర్ యొక్క వాలిడిటీ 28 రోజులు. వినియోగదారులు ఈ క్యాష్బ్యాక్ ని 12 నెలలు  వరకు నెలకు రూ 100  వౌచర్ గా  పొందుతారు.
క్యాష్ బ్యాక్ వోచర్లు కస్టమర్ యొక్క అకౌంట్ లోకి వస్తాయి  మరియు మైజియో యాప్ లో మై వోచర్ సెక్షన్ లో కనిపిస్తుంది. ఈ వోచర్లు ఒక సమయంలో ఒకసారి ఉపయోగించబడతాయి.JIO -Redmi 5A  ఆఫర్ డిసెంబరు 5, 2017 మరియు నవంబరు 30, 2018 మధ్యకాలంలో కొనుగోలు లేదా రీఛార్జ్ చేసిన ఫోన్స్  కోసం జియో-రెడ్మి 5 ఎ ఆఫర్ చెల్లుతుంది.

 

Connect On :