Xiaomi Redmi 4X స్మార్ట్ ఫోన్ 4GB RAM తో చైనా లో లాంచ్
Xiaomi Redmi 4X స్మార్ట్ ఫోన్ 4GB RAM తో చైనా లో లాంచ్
షియోమీ కంపెనీ కొంతసేపటి ముందే Xiaomi Redmi 4X రెండు వేరియంట్స్ ని ప్రవేశపెట్టింది.2GB RAM తో 16GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 3GB RAM తో 32GB ఇంటర్నల్ స్టోరేజ్ . ఇప్పుడు షియోమీ Redmi 4X యొక్క ఒక కొత్త అప్డేటెడ్ వేరియంట్ ప్రవేశం జరిగింది. దీనిలో 4GB RAM తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది.
మొదటగా ప్రవేశపెట్టబడిన 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 699 Yuan అంటే సుమారు Rs. 6,792 అలాగే 3GB RAM మరియు 32GB స్టోరేజ్ గల వేరియంట్ ధర 1099 Yuan అంటే సుమారు Rs. 10,277 ఉండొచ్చు . ఇవి 9 మే నుంచి అమ్మకానికి అందుబాటులోకి వస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్ చెర్రీ పింక్ షాంపైన్ గోల్డ్ మరియు మెట్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో కలదు .
Xiaomi Redmi 4X యొక్క ఫీచర్స్ 5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే కలదు . మరియు రెసొల్యూషన్ 720×1280 పిక్సల్స్ . ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 435 ప్రోసెసర్ . అడ్రినో 505 GPU కూడా వుంది. మరియు 2GB/3GB/4GB RAM లు కలవు మరియు 16GB/32GB/64GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలవు . దీని స్టోరేజ్ ని మైక్రో ఎస్డీ ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై పనిచేస్తుంది. దీనిలో 4100mAh బ్యాటరీ గలదు .
13 ఎంపీ రేర్ కెమెరా f/2.0 అపార్చర్ , 5P లెన్స్ , PDAF, LED ఫ్లాష్ తో వస్తుంది. మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది. హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ , 4G LTE, వైఫై బ్లూటూత్ ,, GPSm మరియు ఒక మైక్రో USB పోర్ట్ మరియు థిక్ నెస్ 8.65mm , బరువు 150 గ్రాములు .
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile