Xiaomi Redmi 4A సేల్స్ సంచలనం
4 నిముషాలలో 250,000 యూనిట్స్ సేల్స్ కంప్లీట్
షియోమీ కంపెనీ నుంచి నిన్నే రిలీజ్ అయిన Xiaomi Redmi 4A హ్యాండ్ సెట్ సేల్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. నిన్న మధ్యాహం 12 గంటల నుంచి అమెజాన్ మరియు Mi.com. లో వీటి సేల్స్ ప్రారంభమయ్యాయి.
Redmi 4A స్మార్ట్ ఫోన్ అనుకోని విధముగా ఇండియాలో అతితక్కువ టైం లో వేగముగా అమ్ముడుపోయిన ఫాస్టెస్ట్ స్మార్ట్ ఫోన్ గా ఒక కొత్త రికార్డు సృష్టిస్తుంది.
అమెజాన్ మరియు Mi.com. లో 4 నిముషాలలో 250,000 యూనిట్స్ సేల్స్ కంప్లీట్ చేసుకుంది.
Redmi 4A స్పెసిఫికేషన్స్ మీకోసం ఇవ్వబడినవి వీటిపై ఓ లుక్కేయండి. Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి
5 ఇంచెస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే కలిగి ,రిసల్యూషన్ మరి 720 x 1280పిక్సల్స్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్.1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ,2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి. ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ. కేవలం సామాన్య మానవునికి అందుబాటులో ఉండటానికే ఈ బడ్జెట్ ఫోన్ ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.