నిన్న xiaomi redmi 4 స్మార్ట్ ఫోన్ సేల్స్ అమెజాన్ లో 12 గంటలకు మొదలై రెప్పపాటులో అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి చాలా మంది ఈ సేల్ ని మిస్ అయ్యారు. అటువంటి వారికి ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే మరొక ఫ్లాష్ సేల్ తో ఈ స్మార్ట్ ఫోన్ మనముందుకు వచ్చేస్తోంది. జూన్ 6 న మరల దీని ఫ్లాష్ సేల్స్ అమెజాన్ లో ఎక్సక్లూజివ్ గా జరగనున్నాయి. మద్యాహ్నం 12 గంటలనుంచి అమెజాన్ లో జరగనున్నాయి.
మరియు ఇంతకు ముందర Redmi 4A లాంచ్ చేసే సమయంలో Redmi 3S యొక్క కొత్త వేరియంట్ కూడా ప్రవేశం కానుంది. అని ప్రకటించారు . ఈ వేరియంట్ యొక్క పేరు Xiaomi Redmi 4 గత ఏడాదిలోనే దీనిని చైనా లో విడుదల చేశారు
Xiaomi Redmi 4ఇక దీని ఫీచర్స్ పై కన్నేస్తే 5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280×720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB ram మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు.
మరియు ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై MIUI 8 ఆధారముగా పని చేస్తుంది.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఏ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది . మరియు దీనిలో 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది. . ఒక మైక్రో USB పోర్ట్ కూడా వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156 గ్రాములు .