షావోమి ఇప్పటికే MIUI 10 అప్డేటును దాని ఫోన్ల కోసం విడుదలచేసింది మరియు ఈ అప్డేట్ కంపెనీ యొక్క కొన్ని పాత ఫోన్లకు కూడా అందిస్తోంది. ఇచ్చిన మాటప్రకారం, ఈ సంస్థ ఇప్పుడు షావోమి రెడ్మి 4 మరియు రెడ్మి 4A కు ఈ MIUI 10 గ్లోబల్ స్టెబుల్ ROM సీడింగ్ చేస్తోంది. ఇది మొదటగా FoneArena లో కనిపించింది, కంపెనీ Mi ఫోరమ్స్ వార్తల ద్వారా, ఈ అప్డేట్ Redmi 4A కోసం ప్రకటించారు. Redmi 4, యొక్క అప్డేట్ గురించి అధికారిక ప్రకటన ఏమీ లేదు కానీ, రెడ్మి 4 యొక్క కొంతమంది వినియోగదారులు తమ పరికరాలకు అందుబాటులో ఉన్న కొత్త అప్డేట్ స్క్రీన్ షాట్ లతో పోస్ట్ చేశారు.
ఈ రెడ్మి 4 మరియు రెడ్మి 4Aలకు ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్ ఆధారంగా, రెండింటికీ MIUI 10 అప్డేట్ అవుతుంది. ఈ రెండు పరికరాలకు UI మరియు కలర్ స్కీమ్ పరంగా ఫేస్లిఫ్ట్ లభిస్తుందని అర్థం, అంతర్లీన వుండే OS కి ఈ అప్డేట్ లేదు. అదనంగా, Redmi 4A పై భద్రతా ప్యాచ్ స్థాయి జూలై 2018 ప్యాచీతో కొంచెం పాతగా ఉంటుంది, అయితే రెడ్మి 4 అక్టోబర్ 2018 సెక్యూరిటీ అప్డేటును పొందుతుంది. రెడ్మి 4 కొరకు, MIUI 10.1.1.0.NAMMFI అప్డేట్ పరిమాణం 316MB మరియు రెడ్మి 4A అప్డేట్ కోసం MIUI 10.1.1.0.NCCMIFI యొక్క పరిమాణం 268MB గా ఉంటుంది.
భారతదేశంలో గత ఏడాది, ఆండ్రాయిడ్ 6.0 మార్షమౌల్లో నడుస్తున్న రెడ్మి 4 మరియు రెడ్మి 4A లు ప్రారంభించబడ్డాయి. తరువాత వారు MIUI 9 తో ఆండ్రాయిడ్ నౌగాట్లో కి అప్డేట్ పొందారు మరియు ఎట్టకేలకు ఈ MIUI 10 అప్డేట్ అందుకోనున్నారు. అయినప్పటికీ, Mi ఫోరమ్స్ లోని కొందరు వినియోగదారులు చాలా ఆకర్షణీయమైన MIUI 10 ఫీచర్లు అయినటువంటి, పేస్ అన్లాక్ మరియు ఒకే కెమెరాతో బాక్హై మోడ్ మద్దతు వంటివి అందుబాటులో లేవని ఫిర్యాదు చేసారు. అయితే, సంస్థ భవిష్యత్ నవీకరణతో ఈ లక్షణాలను ఫోనులకు విడుదల చేస్తుంది ఆశిద్దాం. షావోమి రెడ్మి 4 / 4A వినియోగదారులు తమ యూనిట్లలో దీని అందుబాటు కోసం చుడాలంటే, సెట్టింగులకు వెళ్లడం ద్వారా తనిఖీ చేయవచ్చు Settings > About Phone > System Updets > లో అప్డేట్ కోసం తనిఖీ చేయండి. ఇది ఎయిర్ (OTA) కోసం ఈ అప్డేట్ విడుదల చేయబడింది కాబట్టి, నేరుగా పరికరాల్లో ఈ అప్డేట్ చేరుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు.
Via : FoneArena