MIUI 10 అప్డేట్ అందుకుంటున్న షావోమి రెడ్మి3S, రెడ్మి3S ప్రైమ్ మరియు రెడ్మి 4
MIUI 10 కొత్త గెస్చర్- బేస్డ్ నావిగేషన్, పిక్చర్-ఇన్-పిక్చర్, ఒక కొత్త రికార్డు మెను, ఆటోఫిల్ మద్దతు, మెరుగైన ఫోటో ఎడిటింగ్ మరియు స్క్రీన్ రికార్డింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
షావోమి రెడ్మి3S, రెడ్మి3S ప్రైమ్ మరియు రెడ్మి 4 వినియోగదారులు ఇపుడు MIUI 10 కు అప్డేటును అందుకుంటారు . షావోమి తన MIUI ఫోరమ్లో ప్రకటించిన విధంగా గ్లోబల్ స్టేబుల్ అప్డేట్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. ఈ అప్డేట్ Android Oreo 8.1 Oreo ఆధారంగా ఉంటుంది మరియు కొత్త UI, పునరుద్ధరించిన సిస్టమ్ ఆప్స్ మరియు మరిన్నికొన్ని ఇతర కొత్త లక్షణాలను తెస్తుంది.
ఈ అప్డేట్ కోసం ఫైల్ యొక్క పరిమాణం ఫోన్ నుండి ఫోనుకు భిన్నంగా ఉంటుంది. Redmi 3s మరియు Redmi 3s prime,కోసం అప్డేట్ వెర్షన్ MIUI 10 V10.1.1.0.MALMIFI అయితే Redmi 4 కోసం V10.1.1.0.NAMMIFI గా ఉంటుంది.
Xiaomi OTA ద్వారా విడుదలచేసింది మరియు వేగవంతమైన Wi-Fi కనెక్షనుకు కనెక్ట్ అయినప్పుడు మీరు దాన్ని డౌన్లోడ్ చేయవచ్చు. ఈ అప్డేట్ ను ఇన్స్టాల్ చేయడానికి ముందు ఫోన్లో సుమారు 80 శాతం ఛార్జ్ ఉండేటట్లు చూసుకోవాలి.
MIUI 10 కొత్త గెస్చర్- బేస్డ్ నావిగేషన్, పిక్చర్-ఇన్-పిక్చర్, ఒక కొత్త రికార్డు మెను, ఆటోఫిల్ మద్దతు, మెరుగైన ఫోటో ఎడిటింగ్ మరియు స్క్రీన్ రికార్డింగ్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
మీరు ఈ అప్డేట్ కోసం ఇలాగ చెక్ చెయ్యండి settings → About Phone → System Updates → Check For Updates ద్వారా అందుబాటులో ఉన్నట్లయితే మీరు తనిఖీ చేయవచ్చు. ఈ సందర్భంలో మీరు వెంటనే సరైన అప్డేట్ పొందలేకపోతే, Xiaomi కూడా మీ సంబంధిత ఫోన్లకు sideload గా Fastboot మరియు రికవరీ ROM కోసం డౌన్లోడ్ లింకులు కూడా విడుదల చేసింది.
మీరు మీ పూర్తి డేటా యొక్క బ్యాకప్ను కలిగి ఉన్నారని నిర్ధారించుకోవాలి, ఎందుకంటే ఈ అప్డేట్ మీ యొక్క అన్ని ఫోటోలు మరియు సందేశాలను తీసివేయవచ్చు .