Xiaomi ఇండియాలో ఉదయం చెప్పినట్లుగానే రెడ్మి 3S ఫోన్ లాంచ్ చేసింది. అయితే దీనితో పాటు రెడ్మి 3S prime అనే రెండవ మోడల్ కూడా రిలీజ్ అయ్యింది.
మెటల్ బాడీ తో వస్తున్నాయి రెండు ఫోనులు రెడ్మి 3S(6,999 రూ) లో 2GB రామ్/16GB స్టోరేజ్ , రెడ్మి 3S prime(8,999 రూ) లో 3GB ర్యామ్/32GB స్టోరేజ్ ఉన్నాయి. sd కార్డ్ సపోర్ట్ ఉంది, కాని డ్యూయల్ సిమ్ హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది ఫోన్.
ఇక రెండింటిలోనూ ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే.. 5 in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 430 SoC, 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్, 4100 mah బ్యాటరీ.
ఫింగర్ ప్రింట్ స్కానర్ on backside ఉన్నాయి. ఫోన్ రెడ్మి నోట్ 3 కన్నా చిన్నగా ఉంటుంది. గోల్డ్, గ్రే అండ్ వైట్ కలర్స్ లో వస్తున్నాయి.
ఈ రెండు మోడల్స్ ఇప్పుడు లెనోవో vibe K5 ప్లస్, కూల్ ప్యాడ్ నోట్ 3 అండ్ నోట్ 3 Lite కు పోటీ ఇవనున్నాయి. ఒక వెయ్యి రూ డిఫరెన్స్ తో రెడ్మి నోట్ 3 2GB ర్యామ్ వేరియంట్ కు కూడా పోటీ గా ఉన్నట్లు ఉంది.
స్పెక్స్ వైజ్ గా చూసినా మరియు చేతిలో ఉన్న మొదటి లుక్స్ ద్వారా కంపెని మరో సారి సక్సెస్ ఫుల్ హాండ్ సెట్ ను ప్రవేశ పెట్టినట్లు అనిపిస్తుంది. అతి త్వరలోనే రివ్యూ కూడా వస్తుంది..ఆల్రెడీ హ్యాండ్ సెట్ వాడుతున్నాము..