షియోమీ పోకోఫోన్ ఎఫ్1 యొక్క బ్లూటూత్ సర్టిఫికేషన్ ద్వారా అది ఒక లిక్విడ్ -కూల్డ్ సీపీయూ అని బహిర్గతం అవుతుంది

Updated on 31-Jul-2018
HIGHLIGHTS

పైన ఆరోపించిన విధంగా పోకోఫోన్ మరింత అధికంగా పనిచేయడం కోసం ఇది లిక్విడ్ -కూల్ తో కూడిన స్నాప్ డ్రాగన్ 845 SoC శక్తితో పనిచేసే విధంగా ఉండనుంది .

షియోమీ యొక్క ఫోన్ల లైన్ అప్ మీద ఉన్న పుకార్లు, ఇప్పుడు అందించనున్న  మరొక ఉప-బ్రాండ్ పోకోఫోన్ స్పష్టమైన పరిచయం తో ఇంకా గందరగోళం నెలకొంది . పుకార్లు సృష్టిస్తున్న పోకాఫోన్ అని పిలవబడనున్న ఈ ఫోన్ ఇటీవలే యూఎస్ FCC, తైవాన్ యొక్క NCC మరియు యూరోప్ యొక్క ECC లో కనిపించాయి, తద్వారా ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందని సూచిస్తుంది . ఈ ఫోన్ భారతదేశం లో కూడా విడుదల కానుందని ఇటీవల కాలంలో ఒక టిప్స్టర్ తెలిపారు .ఇప్పుడు, మై స్మార్ట్ ప్రైస్  ఒక నివేదికలో తెలిపిన విధంగా , ఈ పోకాఫోన్ ఎఫ్ 1 పొందిన బ్లూ టూత్ సర్టిఫికేషన్ ద్వారా ఇది స్నాప్ డ్రాగన్ 845 శక్తితో పనిచేస్తుందని వెల్లడవుతుంది . ఇది ఫ్లాగ్ షిప్  ప్రాసెసర్ శక్తితో  పనిచేసే చౌకైన స్మార్ట్ ఫోన్ లాగా కనిపిస్తుంది.

 ఈ బ్లూ టూత్ సర్టిఫికేషన్ ఇంకా ఏమేమి వివరిస్తుందంటే ఈ చిప్సెట్ ఈ పరికరం ఒక్క యూ ఎస్ పి మాత్రమే కాదని ,ఈ ప్రొసెసర్ లిక్విడ్-కూల్డ్ గా పనిచేస్తుందని చెబుతుంది . ఈ చిప్సెట్  6జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో కూడివుంది ఇది 8జీబీ మరియు 128జీబీ వరకు పెరుగుతుంది .ఈ పోకోఫోన్ ఎఫ్ 1 లో లోతైన సెన్సింగ్ కోసం 12ఎంపీ కెమేరా ని ఒక 5ఎంపీ సెన్సార్ తో అనుసంధానించారు. ఇంకా దీనిలో మాజీ 1.4um పిక్సెల్ పిచ్ కూడా  ఉంటుంది. 

ముందు 20ఎంపీ సెన్సార్  ఉంటుంది మరియు అంతేకాక ఇది పిక్సెల్ బిన్నింగ్ ని అమలు చేస్తుంది. ముందు కెమెరాతో పాటు జతగా ఉన్న ఇన్ఫ్రారెడ్ ఇల్యూమినేటర్  మరియు ఇన్ఫ్రారెడ్ కెమెరా కూడా ఇది వేగమైన  మరియు  సురక్షితమైన ఫేస్ అన్లాక్ చేయడం కోసం ఉపయోగపడుతుంది . బహుశా ఇది Mi 8 లోని కొన్ని అంశాలకు సమానంగా ఉండవచ్చు.

 ఈ పరికరం ఎం 1805E 10A మోడల్ నంబర్ గా కలిగివుంటుంది అలాగే ఇది బాక్స్ నుండి తీస్తూనే MIUI 10 తో పనిచేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :