Xiaomi భారతదేశంలో తక్కువ ధరతో ప్రధాన స్పెక్స్ తో Poco F1 ని ప్రారంభించింది. ఈ స్మార్ట్ఫోన్నీ కంపెనీ మూడు వేరియంట్లలో ప్రారంభించింది మరియు దీని ధర 20.999 రూపాయల నుంచి మొదలవుంతుంది. ఈ స్మార్ట్ఫోన్ యొక్క ఫ్లాష్ సెల్ నేడు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ నుండి ప్రారంభం కానుంది. కాబట్టి మీరు, దీనికి కొన్ని నిమిషాలు ముందే ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ తో ఆన్లైన్ లో ఉండమని సిఫార్సు చేస్తాము ఎందుకంటె ఈ ధర మీకు కేవలం Flash సెల్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ సెల్, లిమిటెడ్ స్టాక్ ఫ్లాష్ డివైజ్ కాబట్టి.
Xiaomi Poco F1 స్పెసిఫికేషన్స్
Poco F1 లో ఒక ఉన్నతస్థాయి చిప్సెట్తో పాటు ఇతర స్పెక్స్ గురించి మాట్లాడితే, ఇది ఒక డ్యూయల్ కెమెరా సెటప్గా ఒక 12-మెగాపిక్సెల్ + 5-మెగాపిక్సెల్ కెమెరా లను AI సామర్థ్యాలతో కలిగి ఉంటుంది. అలాగే ఒక 20-మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ ముందు భాగంలో అందించబడింది. ఈ ఫోన్లో 4,000 mAh సామర్థ్యం గల బ్యాటరీ అందుబాటులో ఉంది, ఇంకా ఇది త్వరిత ఛార్జ్ 3.0 కు మద్దతు ఇస్తుంది.
ఈ ఫోన్ ఒక 6.18 అంగుళాల FHD + 18.7:9 యాస్పెక్ట్ రేషియాతో మరియు హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ కూడా స్లాట్ పొందుతయారు. ఈ డివైజ్లో కూడా డ్యూయల్ VoLTE మద్దతు ఇచ్చారు. ఈ స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 SOC మరియు 4,000mAh బ్యాటరీ అమర్చారు.
Xiaomi Poco F1 ధరలు
Xiaomi అనేక ధర ట్యాగ్లతో Poco F1 ను విడుదల చేసింది, దీని 64GB + 6GB వేరియంట్ రూ .20,999 గా ఉంది, అదే సమయంలో డివైజ్ యొక్క ప్రత్యేకమైన అర్మౌర్డ్ వెర్షన్ 28,999 రూపాయలతో ప్రారంభించబడింది, ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజితో వస్తుంది.