షావోమి యొక్క సరికొత్త ఆలోచన : నాలుగు వక్ర అంచులు (4 వైపులా కర్వ్డ్ స్క్రీన్) తో ఫోన్ కోసం పేటెంట్ దాఖలు

షావోమి యొక్క సరికొత్త ఆలోచన : నాలుగు వక్ర అంచులు (4 వైపులా కర్వ్డ్ స్క్రీన్) తో ఫోన్ కోసం పేటెంట్ దాఖలు
HIGHLIGHTS

ఈ చైనీస్ కంపెనీ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ (WIPO) కి ఇటువంటి అంశంతో ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది.

Xiaomi నానాటికి సరికొత్త టెక్నాలజీని తక్కువధరలో అందిస్తూ, ఇండియాలో మంచి స్థానాన్నిసంపాదించుకుంది. ఈ సంస్థ ఇప్పుడు, నాలుగు వైపులా వక్రంగా  (Curved) స్క్రీన్ ఉండేలా, ఒక స్మార్ట్ ఫోన్ తయారికోసం తన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, Letsgodigital.org ద్వారా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఈ చైనీస్ కంపెనీ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ (WIPO) కి ఇటువంటి అంశంతో ఒక పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. ఈ వెబ్సైట్లో షేర్ చేసిన చిత్రం నుండి గమనిస్తే , ఈ నమూనాలో ముందువైపు ఎలాంటి కెమెరా ఉన్నట్లు కనిపించడం లేదు. కాబట్టి, షావోమి ఒక పాప్ అప్ కెమెరా వంటి వ్యవస్థను  జోడించడానికి ఆలోచిస్తుండవచు, లేదా బహుశా పూర్తిగా కెమెరా లేకుండా ఇవ్వాలని చూస్తుందో అర్ధమే కాలేదు. ఈ ఇమేజీలో చూపించే ఇతర ముఖ్యమైన లక్షణాలుగా,  దిగువన ఉన్న USB టైప్-సి పోర్ట్ మరియు వెనుకవైపు ఉన్న డ్యూయల్-వెనుక కెమెరా సెటప్ ఉన్నాయి.

Xiaomi 4 curved screen intext.jpg

అయితే, ఒక స్మార్ట్ ఫోన్లో వక్ర స్క్రీన్ను(కర్వ్డ్ స్క్రీన్)  ఉంచడం కొత్త విషయమేమి కాదు, శామ్సంగ్ ప్రస్తుతం దాని ప్రధాన స్మార్ట్ ఫోన్లలో, ఇలాంటి ఫీచరునే అందించింది. అయితే, అవి రెండు వైపులా మాత్రమే వక్రతను (కర్వ్డ్)  ప్రదర్శిస్తాయి, కానీ నాలుగు వైపులా మాత్రం కాదు. అందువల్ల, షావోమి ఇప్పుడు దాదాపుగా పూర్తి స్క్రీన్ లో ఈ అనుభవాన్ని అందించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, షావోమి పేటెంట్ కోసం దరఖాస్తు మాత్రమే చేసుకుంది, సంస్థ అదే తయారుచేయాలని  ఎటువంటి హామీ మాత్రం లేదు. కాబట్టి,  ప్రస్తుతానికి మేనము ఇది నిజమవ్వాలని కోరుకోవడం మరియు నిజమయ్యే వరకు వేచిచూడం మాత్రమే చేయగలం.

షావోమి కూడా  ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ పైన కూడా పనిచేస్తున్నట్లు అనిపిస్తోంది. గత నెల, ఈ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు, లిన్ బిన్ ఒక ఫోల్డబుల్  స్మార్ట్ ఫోన్ను గురించి చూపిస్తూ,  ఒక వీడియోను పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫోన్ సగానికి మడిచేలా ఉండదు. బదులుగా, ఇది రెండు వైపుల నుండి వెనక్కి మడవగలిగేలా(ఫోల్డ్ చేసేలా) ఉంటుంది. అయితే, ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కోసం పనిచేస్తున్నవారిలో షావోమి మాత్రమే ఒంటరిది కాదు. శామ్సంగ్ మరియు హువావే లు MWC 2019 లో ఇటువంటి డివైజెస్ ప్రదర్శిస్తాయని భావిస్తున్నారు, అయితే Royole ఇప్పటికే FlexPie  అని పిలిచే ఒక ఫోల్డబుల్ డివైజ్ ను ప్రారంభించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo