షావోమి మి 9 ఫిబ్రవరి 20 న చైనాలో విడుదలకానున్నది

షావోమి మి 9 ఫిబ్రవరి 20 న చైనాలో విడుదలకానున్నది
HIGHLIGHTS

సంస్థ వ్యవస్థాపకుడు మరియు CEO అయిన, లీ జున్ వైబో టీజర్లో ఈ విడుదల తేదీని ప్రకటించారు.

షావోమి, చైనా లో Mi 9 స్మార్ట్ ఫోన్ను ఫిబ్రవరి 20న  ప్రారంభించనున్నట్లు , సంస్థ వ్యవస్థాపకుడు మరియు CEO అయిన, లీ జున్ ప్రకటించారు. అయన తన అధికారిక Weibo ఖాతాలో దీని టీజరు యొక్క పోస్టర్ను పోస్ట్ చేసారు, మి అభిమానులకు ఆహ్వానం కూడా అందించారు. చైనీయ  సోషల్ మీడియా వేదికపై మరొక పోస్టర్ కూడా ఉంది, దీనిలో చైనీస్ బాయ్ బ్యాండ్ TFBoys నుంచి రాయ్ వాంగ్, ఈ ఫోన్ పట్టుకోవడం కనిపిస్తుంది. ఈ పోస్టర్ కూడా ఫోన్ యొక్క వెనుకభాగంలో మూడు కెమెరాలలను కలిగివున్నట్లు తెలియజేస్తుంది.

జూన్ పోస్ట్ ని తర్జుమాచేస్తే,  షావోమి ఈ ఫోన్ను "ఈ సంవత్సరానికి అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్షిప్" అని పిలిచిందని మరియు అతను Mi 9 "ఉత్తమంగా కనిపించే మిల్లెట్ (Mi) ఫోన్" అని పేర్కొన్నాడు. అంతేకాకుండా, ఫోన్ యొక్క అంతర్గత కోడ్ పేరు, "బ్యాటిల్ ఏంజిల్" గా ఆవిష్కరించినట్లు తెలిపారు.  మునుపటి నివేదికలు షావోమి ఒక రెండు ఫోన్లను ప్రారంభించవచ్చని చెప్పింది, అవి : సాధారణ Mi 9 మరియు Mi 9 SE గా పేర్కొంది. Mi 5 తీసుకొచ్చిన తరువాత నుండి షావోమి  భారతదేశంలో ఎటువంటి Mi డివైజ్ ను రవాణా చేయలేదు మరియు ఇది భారతదేశంలో ఈ డివైజ్ ను ప్రారంభిస్తుందా లేదా అనే సమాచారం ఇంకా లేదు.

Mi 9 Poster.jpg

గత నెలలో, ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నోచ్ తో ఉన్నట్లు చూపించే రెండర్స్ వెబ్లో ప్రచారం చేయబడింది. ఈ ఫోన్ తక్కువ బెజెల్లతో ఒక 6.4-అంగుళాల డిస్ప్లేతో వుండే  అవకాశం కల్పిస్తుంది మరియు సుమారు 90 శాతం స్క్రీన్ టూ బాడీ  డిస్ప్లేను అందించగలదు. ఈ రెండిర్స్, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ను వెల్లడి చేసింది మరియు ఇప్పుడు వైబోలో అందించిన పోస్టర్ ద్వారా పూర్తిగా నిర్ధారించబడింది. షావోమి మి 9 లో ఒక 48MP సెన్సార్ , ఒక 18MP ఒక మరియు ఒక 8MP సెన్సార్ ఉండవచ్చు అని అంచనావేస్తున్నారు.

Mi అనేది షావోమి యొక్క ప్రధాన సిరీస్ అవుంతుంది కాబట్టి,  ఇది ఎల్లప్పుడూ క్వాల్కమ్ యొక్క అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్లను కలిగి ఉంటాయి. దీనిప్రకారంగా చూస్తే , Xiaomi Mi 9  ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ తో ఉండవచ్చని ఉహించవచ్చు . గతంలో, జున్  Mi 9 ఒక 24W వేగవంతమైన ఛార్జింగ్కు మద్దతు ఇస్తుందని Weibo లో తెలిపారు, అయితే, లీకైన స్పెక్స్ ప్రకారంగా ఇది ఒక 32W వేగవంతమైన ఛార్జింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. షావోమి  కూడా ఈ సంవత్సరం MWC లో ముందుగా దీని యొక్క ప్రదర్శన చేసే అవకాశంఉంది. ఈ కంపెనీ, షావోమి యొక్క 5G వేరియంట్ అయిన, మి మిక్స్ 3  ను కూడా ఆవిష్కరించనుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo