4GB రామ్ తో చిన్న స్క్రీన్ ఫోన్స్ ఇష్టపడే వారికి Xiaomi కొత్త ఫోన్

4GB రామ్ తో చిన్న స్క్రీన్ ఫోన్స్ ఇష్టపడే వారికి Xiaomi కొత్త ఫోన్

Xiaomi compact సైజ్ లో చిన్నగా ఉండే ఫోనులను ఇష్టపడే వారికి 4.6 inch స్క్రీన్ తో కొత్త ఫోన్ పై పనిచేస్తున్నట్లు లేటెస్ట్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది.

దీని పేరు Mi S అని కూడా లీక్ అయిన సమాచారం చెబుతుంది. చైనీస్ ఫేమస్ సోషల్ నెట్ వర్కింగ్, Weibo సైట్ లో ఈ లింక్ లో ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి.

దీనిలో ఉండే స్పెక్స్ – స్నాప్ డ్రాగన్ 821 SoC, ఫుల్ HD 2.5D curved 600 nits డిస్ప్లే, 4GB రామ్, 128GB స్టోరేజ్, 12MP సోనీ IMX378 రేర్ కెమెరా.

4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, 4MP ఫ్రంట్ కెమెరా, 2600mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ 3.0 సపోర్ట్, USB టైప్ C పోర్ట్, ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్.

కేవలం ప్రైసింగ్ మరియు రిలీజ్ డేట్ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. ఇదే మాదిరి గతంలో కూడా ఐ ఫోన్ SE కు పోటీ గా Xiaomi చిన్న స్క్రీన్ ఫోన్ లాంచ్ చేస్తుంది అని వార్తలు వినిపించాయి.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo