xiaomi Mi Play : చైనాలో వాటర్ డ్రాప్ నోచ్ తో టీజ్ చేస్తున్న షావోమి, ఈ ఫోన్ డిసెంబర్ 24న విడుదలకానుంది

xiaomi Mi Play : చైనాలో వాటర్ డ్రాప్ నోచ్ తో టీజ్ చేస్తున్న షావోమి, ఈ ఫోన్ డిసెంబర్ 24న విడుదలకానుంది
HIGHLIGHTS

ఈ ఫోన్ ఒక 2.3 GHz గడియారం వేగంతో ఒక ఆక్టా-కోర్ CPUతో ఉంటుంది మరియు ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది.

ఈ xiaomi Mi Play ముఖ్యాంశాలు

డిసెంబర్ 24 కి షావోమి మి ప్లే లాంచ్ డేట్ సెట్ చేయబడింది

Mi Play ఒక ఆక్టా-కోర్ CPU ను కలిగి ఉంటుంది

Mi Play ఫోన్ 11 కలర్ వేరియంట్లలో లభిస్తుంది

మోడల్ M1901F9T తో షావోమి ఫోన్ యొక్క వివరాలు TENAA లో బయటపడ్డాయి. ముందుగా, షావోమి రెడ్మి7 శ్రేణికి సంబంధించిన పరికరాల్లో ఒకటిగా భావించిన స్మార్ట్ ఫోన్, Xiaomi Mi Play హ్యాండ్ సెట్ గా చెప్పబడింది. ఈ ఫోన్ ఇప్పుడు షావోమి యొక్క చైనా వెబ్సైట్లో టీజ్ చేస్తోంది మరియు డిసెంబర్ 24న విడుదలకానుంది. ఈ జాబితా ప్రకారం, ఈ ఫోన్ ఒక 2.3 GHz గడియారం వేగంతో ఒక ఆక్టా-కోర్ CPUతో ఉంటుంది మరియు ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది.

మేము ఈ ఫోన్ యొక్క ఇతర విశిష్టతలను తెలియచేసేముందు, ఇంటర్నెట్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నగందరగోళ నివేదికలపై ఒక క్లారిటీ  చేయాలనుకుంటున్నాము. ఇటీవల, మోడల్ సంఖ్యలు M1901F7E, M1901F7T మరియు M1901F7C తో కొన్ని Xiaomi ఫోన్లు 3C వెబ్సైట్లో కనిపించాయి అవీ షావోమి రెడ్మి 7 సిరీసుకు చెందినవిగా చెప్పారు. ఈ పరికరాలను గురించి నివేదిందించిన కొన్ని గంటల్లోనే, ఒక ప్రత్యేక నివేదిక TENAA పై మోడల్ సంఖ్య M1901F9T తో మరొక షావోమి  ఫోన్ను పేర్కొంది.

Xiaomi Mi Play.jpg

M1901F9T అనేది 3C వెబ్ సైట్లో కనిపించిన వాటిలో అదే శ్రేణిలో ప్రత్యేకమైన వేరియంట్ ఫోన్ అని పలు మీడియా పోర్టల్స్ నివేదించాయి. కొన్ని గంటల తరువాత, మోడల్ సంఖ్య M1901F9T తో రానుంది రెడ్మి 7 సిరీసుకు చెందినది కాదు, అది వేరొక ఫోన్ అని తెలిపాయి. దీనిని, Xiaomi Mi Play అని పిలుస్తారు, ఈ ఫోన్ కనీసం 11 రంగు ఎంపికలలో లాంచ్ చేస్తుంది.

మునుపటి TENAA జాబితా ఫోన్ గురించి చాలా సమాచారం ఇవ్వలేదు కానీ ఇప్పుడు వేరియంట్, రంగులు మరియు బ్యాటరీ గురించి సమాచారం వెల్లడైంది. Xiaomi M1901F9T లేదా Mi Play ఒక 5.84-అంగుళాల మల్టీ-టచ్ TFT డిస్ప్లేను 2280 x 1080 పిక్సల్స్ రిజుల్యూషన్ మరియు 19: 9 ఆస్పెక్ట్ రేషియాతో  అందిస్తుంది. ఇది 2900 mAh బ్యాటరీ మరియు వెనుక ఒక మీద వేలిముద్ర సెన్సార్ కలిగివుంది. ఇది  MiUI తో Android 8.1 Oreo OS పైన నడుస్తుంది.

హుడ్ కింద, ఈ మి ప్లే ఒక 2.3GHz ఆక్టా – కోర్ ప్రాసెసర్తో శక్తినివ్వగలదు మరియు మూడు రకాల స్టోరేజ్ ఎంపికలతో కలిసి ఉంటుంది: 32GB స్టోరేజి 3GB RAM, 64GB స్టోరేజి 4GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజి 6GB RAM. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 256GB వరకు స్టోరేజిని విస్తరించవచ్చు. ఆప్టిక్స్ పరంగా చూస్తే, ఈ పరికరం 12MP ప్రాధమిక సెన్సార్తో ఒక డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగి ఉంది, దీనిలో ఇంకా పేర్కొనని ద్వితీయ షూటర్ మరియు LED ఫ్లాష్ ఉంటాయి. ముందు, ఒక 8MP స్నాపర్ ఉంది.

బ్లాక్, వైట్, బ్లూ, రెడ్, ఎల్లో, పింక్, గ్రీన్, పర్పుల్, గోల్డ్, సిల్వర్ మరియు గ్రే రంగులలో Xiaomi Mi Play వస్తుంది. మునుపటి TENAA లిస్టింగ్ వాటర్ డ్రాప్  ఆకారంలో ఒక నోచ్ కలిగిన స్మార్ట్ ఫోన్నుచూపించింది. వాల్యూమ్ రాకర్ మరియు పవర్ బటన్లు పరికరం యొక్క కుడి అంచున కనిపిస్తాయి. 3C లిస్టింగ్ తరువాత మోడల్ సంఖ్య M1901F9T తో పాటు మరొక మోడల్ సంఖ్య M1901F9E ను చూపించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo