Xiaomi Mi Play అధికారిక చిత్రాల విడుదల : గ్రేడియంట్ కలర్ ఫినిష్ తో మెసరిసిపోతున్నాయి
చైనాలో రేపు విడుదలకానున్నఈ స్మార్ట్ ఫోను యొక్క చిత్రాలను, షావోమి ప్రసిడెంట్ షేర్ చేసారు.
యువతను లక్ష్యంగా చేసుకొని, Xiaomi యొక్క తదుపరి స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టడానికి చూస్తున్న ఈ షావోమి మి ప్లే యొక్క చిత్రాలను, చివరికి కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ ఫోన్ను రేపు చైనాలో ప్రారంభించనుంది మరియు ఇది వాటర్ డ్రాప్ ఆకారపు నోచ్ తో వస్తాయి. ముందుభాగాన్ని వివరించే ఎటువంటి చిత్రాలు లేనప్పటికీ, వాటర్ డ్రాప్ నోచ్ ఫోన్ యొక్క సంగతి TENAA లిస్టింగ్ ద్వారా వెల్లడైంది.
విడుదలచేయడానికి కేవలం ఒక రోజు ముందు, షావోమి అధ్యక్షుడు లిన్ బిన్ Xiaomi Mi Play యొక్క అధికారిక చిత్రాలు పంచుకున్నారు, ఫోన్లు గ్రేడియన్ట్ కలర్ ని కలిగివున్నట్లు చూడవచ్చు. షేర్ చేసిన చిత్రాలు, డ్రీమ్ బ్లూ మరియు డాన్ గోల్డ్ మాత్రమే వెల్లడిచేయబడ్డాయి, కానీ నల్ల రంగు వేరియంట్ ఉన్నట్లు పుకార్లు కూడా ఉన్నాయి. వేలిముద్ర సెన్సార్తో పాటు, వెనుకవైపు డ్యూయల్ కెమెరాల ఉనికిని తప్ప, చిత్రాలు ముందు భాగంలో వివరాలను తెలిపే ఎటువంటి చిత్రాలు కూడా ప్రదర్శించబడలేదు లేదా ఏదైనా ఇతర డిజైన్ లక్షణాలను బహిర్గతం చేయలేదు.
Xiaomi Mi Play స్మార్ట్ఫోన్ పూర్తి HD + రిజల్యూషనుతో ఒక 5.84 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫోన్ అమలు చేయబోయే ప్రాసెసర్ ఏమిటో మనకు తెలియదు, కానీ అది ఆక్టా – కోర్ చిప్ గా ఉంటుందని భావించడం మనకు సురక్షితంగా ఉంటుంది. ఈ ఫోన్ 2,900mAh బ్యాటరీతో వస్తుంది. ఇమేజింగ్ పరంగా, 12-మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్ ఉంది, ఇది ద్వితీయ డీప్ సెన్సింగ్ కెమెరాని కలిగి ఉంటుంది. వాటర్ – డ్రాప్ నోచ్ లో పొందుపరచిన సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ సెన్సార్ను కలిగి ఉంటుంది. 4GB RAM / 64GB స్టోరేజి , 6GB RAM / 64GB స్టోరేజి మరియు 6GB RAM / 128GB స్టోరేజి రకాల్లో ఈ ఫోన్ ప్రారంభించబడుతుందని, ఏ ఫోన్ పైన వచ్చిన వదంతులు సూచిస్తున్నాయి.
ఈ ఫోన్ యొక్క లాంచ్ డేట్ రేపటి కోసం సెట్ చేయబడినప్పటికీ, దీని ధర నిర్ణయించబడదు లేదా ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయబడుతుందా?లేదా షావోమి మి ప్లే, షావోమి నోట్ 7 గా అంతర్జాతీయంగా ప్రారంభించబడవచ్చు అని కూడా పుకార్లు ఉన్నాయి, కానీ ఇంకా ఇది అధికారికంగా నిర్ధారణ కాలేదు.