Xiaomi Mi నోట్ 3 Kris Wu లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ .

Xiaomi Mi  నోట్  3 Kris Wu లిమిటెడ్  ఎడిషన్ లాంచ్ .

Xiaomi ఈ సెప్టెంబర్లో చైనాలో Mi  నోట్ 3 ను ప్రారంభించింది. ఇప్పుడు Xiaomi  కంపెనీ  బ్రాండ్ అంబాసిడర్ Wu Yifan కోసం ప్రత్యేక ఎడిషన్ Mi నోట్ 3 ను ప్రారంభించింది. Wu Yifan ఒక చైనీస్-కెనడియన్ నటుడు మరియు గాయకుడు, క్రిస్ వూ అని కూడా పిలుస్తారు. Xiaomi క్రిస్ వు యొక్క పుట్టినరోజు బహుమతిగా దీనిని లాంచ్ చేసింది.Mi  నోట్  3 4 సైడ్స్  కర్వ్డ్ గ్లాస్ బాడీ  తో  మరియు అది 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది ఒక 5.5-అంగుళాల ఫుల్ HD డిస్ప్లే తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో 64-బిట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ఆక్టో -కోర్ ప్రాసెసర్, అడ్రినో 540 GPU అమర్చారు. ఈ  డివైస్ రెండు స్టోరేజ్  రకాల్లో లభిస్తుంది. ఒక వేరియంట్ 6GBRAM అండ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , మరియు 6GBRAM  అండ్ 128GB స్టోరేజ్  తో వున్నాయి .  ఈ స్టోరేజ్ ని మైక్రో SD ద్వారా ఎక్స్ పాండ్ చేయలేము . Mi నోట్  3  కర్వ్డ్ బ్యాక్  మరియు  ఒక అండర్ గ్లాస్ ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్  స్కానర్ తో  వస్తుంది.
డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలదు 12 ఎంపీ ప్రైమరీ వైడ్ యాంగిల్స్ లెన్స్ 1. 25μmపిక్సల్ సైజ్ ,f/1.8అపార్చర్ ,డ్యూయల్ టోన్ LED ఫ్లాష్  ,4-యాక్సిస్ OIS అండ్ 4K వీడియో రికార్డింగ్ తో వస్తుంది ,12 ఎంపీ సెకండరీ కెమెరా 1.0 μm పిక్సల్ సైజ్ ,52mm పోర్ట్రైట్ లెన్స్
అండ్ f/2.6 అపార్చర్ తో వస్తుంది . ముందు ఒక 16 మెగాపిక్సెల్ షూటర్ ఉంది ఇది 2um పిక్సెల్ సైజు  తో వస్తుంది మరియు కూడా AI బ్యూటీ ఆప్షన్  ఉంది. ఈ డివైస్  AI ఆధారిత పేషియల్ గుర్తింపు   మరియు IR బ్లాస్టర్ ఫీచర్స్ ను అందిస్తుంది.ఈ స్మార్ట్ఫోన్ Android 7.1 నౌగాట్  MIUI 9 తో నడుస్తుంది. క్విక్  ఛార్జ్ 3.0 కి సపోర్ట్ ఇచ్చే  3050 mAh  నాన్ రిమూవబుల్  బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, ఈ ఫోన్ డ్యూయల్  సిమ్, Wi-Fi 802.11 a / b / g / n / ac, డ్యూయల్-బ్యాండ్, వైఫై డైరెక్ట్ , బ్లూటూత్ 5.0, USB-C మరియు NFC కు సపోర్ట్  ఇస్తుంది. ఈ డివైస్ యొక్క డైమెన్షన్స్  152.6 × 73.95 × 7.6 mm మరియు బరువు 163 గ్రాములు.

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo