Xiaomi నిన్న కొత్త డిజైన్ కాన్సెప్ట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. పేరు Mi Mix. ఈ ఫోన్ కు పై భాగంలో మరియు సైడ్స్ లో బాడీ ఉండదు.
అంటే bezel less కాన్సెప్ట్. 91.3 % స్క్రీన్ to బాడీ రేషియో కలిగిన edgeless డిస్ప్లే ఇది. కేవలం ఫోన్ క్రింద భాగంలోనే బాడీ ఉంటుంది. మిగిలిన సైడ్ లో స్క్రీన్ edge వరకూ ఉంటుంది.
ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాయిస్ ను వినటానికి ear speaker piezoelectric acoustic ceramic కాన్సెప్ట్ తో వస్తుంది. అంటే ear piece ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. అలాగే proxmity సెన్సార్ కూడా ఫ్రంట్ లో infrared టెక్నాలజీ తో పనిచేయదు, అల్ట్రా సోనిక్ టెక్నాలజీ తో ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 6.4 in ఫుల్ HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 2.35GHz క్వాడ్ కోర్ 821 SoC, 4GB/6GB రామ్, 128/256GB స్టోరేజ్ వేరియంట్స్.
16MP రేర్ కెమెరా with డ్యూయల్ tone LED flash అండ్ 5MP ఫ్రంట్ కెమెరా (పైన బాడీ లేదు కాబట్టి ఫ్రంట్ కెమెరా ఫోన్ క్రింది భాగంలో ఉంటుంది)
4400 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 6.0 వస్తున్న ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి రావటం లేదు, కేవలం చైనా లోనే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి.
. మొదటి వేరియంట్ ప్రైస్ – సుమారు 34 వేలు, రెండవది సుమారు 39 వేలు.