Weibo సోషల్ నెట్ వర్కింగ్ చైనీస్ సైట్ లో Xiaomi Mi Mix సిరిస్ లో మరొక మోడల్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 17 న దీనికి సంబంధించిన ఇమేజెస్ లీక్ అయ్యాయి.
Xiaomi Mi Mix Nano అనే పేరుతో రానున్న ఈ ఫోన్ లో కూడా 90% స్క్రీన్ to బాడీ రేషియో ఉంటుంది. అయితే మి మిక్స్ లా పెద్ద స్క్రీన్ కాకుండా ఇది 5.5 in స్క్రీన్ తో రానుంది.
ఇంకా స్నాప్ డ్రాగన్ 821 SoC, 4GB రామ్, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మరియు ఇతర స్పెక్స్ తో ఈ ఫోన్ సుమారు 30,000 రూ ఉంటుంది అని అంచనా.
మరోవైపు కంపెని ఇప్పటివరకూ Mi Mix లో మరిన్ని ఫోనులు రానున్నాయి అని ఎక్కడా తెలపలేదు. సో ఇవి కేవలం రూమర్స్ గానే మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
అక్టోబర్ 25 న లాంచ్ అయిన Mi Mix కంప్లీట్ ఫోన్ డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు. ఈ ఫోన్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే బాగా ఫేమస్ అవటానికి కారణం ఫోన్ పైనా, సైడ్స్ లో బాడీ ఉండకుండా స్క్రీన్ edge వరకూ ఉండటం..
Mi మిక్స్ ఒరిజినల్ ఫోన్ ఇమేజెస్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.