xiaomi యొక్క రాబోయే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్, మి మిక్స్ 2s, బహుశా 'నోచ్' డిజైన్ తో రాకపోవొచ్చు . కంపెనీ తన Weibo అకౌంట్ లో తన స్మార్ట్‌ఫోన్ కోసం ఒక టీజర్‌ను పోస్ట్ చేసింది, రాబోయే స్మార్ట్‌ఫోన్ యొక్క అవుట్‌లైన్‌ను చూపిస్తున్నది.
టీజర్ ద్వారా తెలుస్తుందేమిటంటే ఈ ఫోన్ లో ముందు కెమెరా కోసం ఎటువంటి నాచ్ లేదని సూచించింది. ఇప్పటి వరకు ఈ డివైస్ కి సంబంధించిన వచ్చిన అన్ని లీక్‌లు మరియు పుకార్లు నమ్మినట్లయితే, ఫోన్ యొక్క ఎగువ కుడి మూలలో ఒక నాచ్ ఉంటుంది.
ఈ మార్చి 27 న షాంఘైలో ఈ ఫోన్ పరిచయం కానుంది, కంపెనీ ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 SOC ద్వారా ఆధారితం అని ధ్రువీకరించారు.ఈ ఫోన్ AI- కేంద్రీకృత లక్షణాలతో డ్యూయల్ -వెనుక కెమెరా సెటప్ తో వస్తాయి అని నివేదిక పేర్కొంది. ఇది గూగుల్ యొక్క నూతన ఆగ్యుమెంటెడ్ రియాలిటీ ప్లాట్ఫారం (ARCore) తో కూడా లభిస్తుంది. Mi Mix 2S , 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో 5.99 అంగుళాల OLED ఫుల్ HD + డిస్ప్లేని కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్లు Flip-kart లో డిస్కౌంట్ పొందుతున్నాయి…..