Xiaomi సెకెండ్ జెనరేషన్ మి బాండ్ ను లాంచ్ చేసింది, దీని పేరు Mi బాండ్ 1S(1000 రూ సుమారు). ఇది చేతికి వాచ్ వలె పెట్టుకునే ఫిట్ నెస్ ట్రాకర్. దీని తరువాత 20,000 mah పవర్ బ్యాంక్ కూడా రిలీజ్ చేసింది.
కొత్త బ్యాండ్ లో స్లైట్ గా డిజైన్ అండ్ లుక్స్ మారాయి. అలాగే ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ ఆప్షన్ యాడ్ అయ్యింది. కానీ మొదటి దాని వలే దీనిలో కూడా డిస్ప్లే లేదు.
Mi బాండ్ 1S IP67 సర్టిఫైడ్. అంటే డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్(కొంత మేరకు). బ్యాటరీ ముందు సంవత్సరం రిలీజ్ అయిన మొదటి బాండ్ లానే 45mah కలిగి ఉంది. ఇది 30 డేస్ బ్యాక్ అప్ వస్తుంది.
20,000 mah ఉన్న పవర్ బ్యాంక్ కూడా రిలిజ్ చేసింది. ధర – 1,600 రూ. దీని లోపల పానాసోనిక్, LG లచే తయారు చేయబడిన బ్యాతిరీ ఉంది. ఈ రెండు xiaomi accesories ఇండియాలో ఎప్పుడు వస్తాయనేది ఇంకా వెల్లడికాలేదు.