Android 9.0 Pie అప్డేట్ అందుకుంటున్నషావోమి మి A2
షావోమి నుండి ఆండ్రాయిడ్ 9.0 పై అప్డేట్ అందుకున్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ మి A2.
షావోమి కంపెనీ తన మి A2 కోసం ఆండ్రాయిడ్ 9.0 పై అప్డేట్ అప్డేట్ విడుదల చేసింది మరియు కొంతమంది ఈ అప్డేటును అందుకున్నారు కూడా. అంతేకాకుండా, ఆండ్రాయిడ్ 9.0 పై అప్డేట్ అందుకున్న షావోమి యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ మి A2 గా ముందంజలో ఉంటుంది. భారతదేశంలో నవంబర్ 28 వ తేదీన ఈ అప్డేటును చేసినప్పటికీ దీనిని డిసెంబర్ 18 నుండి మి A2 స్మార్ట్ ఫోన్లు స్వీకరిస్తున్నట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలియచేసింది.
అయినప్పటికీ, ఆండ్రాయిడ్ అప్డేటును OTA ద్వారా స్వీకరించబడుతుందిని చెబుతోంది షావోమి. మీ ఫోనులో ఈ అప్డేట్ నోటోఫికేషన్ పొందినట్లయితే, ఈ అప్డేటును స్వీకరించవచ్చు. ఒకవేళ మీరు అంతవరకూ వేచి వుండలేకపోయినట్లయితే మీ ఫోనులోవున్నా సెట్టింగులను వెళ్లి ఈ అప్డేట్ కోసం తనిఖీ చేసుకోవచ్చు
ఈ అప్డేట్ 1078.9 MB పరిమాణంతో ఉంటుంది మరియు ఈ ఆండ్రాయిడ్ 9.0 పై అప్డేట్ ద్వారా ఈ ఫోనులో, సరికొత్త ఫెచర్లను తీసుకోస్తుందని చెబుతోంది షావోమి. అడాప్టివ్ బ్యాటరీ, మరియు బ్రిట్నెస్ లో మెరుగుదల మరియు సులభ పద్దతిలో ఫోన్ నావిగేషన్ వంటి ఫిచర్లతో పాటుగా మరెన్నో సరికొత్త లక్షణాలను తీసుకొస్తుంది, మి A2 లో ఈ ఆండ్రాయిడ్ 9.0 ఫై అప్డేట్.