షియోమీ భారతదేశం లో మీ ఏ1 ప్రారంభించినప్పుడు, ఈ డివైజ్ త్వరగా దాని స్టాక్ ఆండ్రాయిడ్ ముగింపు ఇచ్చిన ఫోన్ గా దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం బడ్జెట్ ఫోన్లులో ఇదీ ఒకటి అయింది. MIUI నుండి నిష్క్రమణ తర్వాత భారత మార్కెట్లో షియోమీ మరింత ట్రాక్షన్ సాధించి, సంస్థ గత సంవత్సరం ఆండ్రాయిడ్ వన్ తో మీ ఏ1 ప్రారంభించినప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ దేశంలో దాని మార్కెట్ లో మరింత వాటా పెంచింది మరియు ప్రీమియం బడ్జెట్ స్మార్ట్ ఫోన్ విభాగంలో ఇది దాదాపు బీట్ చేయలేని బ్రాండ్ గా చేసింది. షియోమీ కూడా వారి ట్విట్టర్ హ్యాండిల్ లో MIUI లేదా స్టాక్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటున్నారో అభిమానుల అభిప్రాయాన్నిఅడుగుతూ ఒక పోల్ జరిగింది, అయితే ఈ పోల్ ఫలితం ఆశ్చర్యకరంగా ఆండ్రాయిడ్ కు అనుకూలంగా ఉంది. అందువల్ల, మీ ఏ1 యొక్క విజయం నుండి ఊపిరి పోసుకున్న మీ ఏ2 మరింత వేగంగా OS నవీకరణలు మరియు ఆండ్రాయిడ్ యొక్క సుపరిచితమైన అనుభూతిని కోరుకుంటున్న వినియోగదారులను నిమగ్నం చేయడానికి దాని అడుగుజాడలని అనుసరించింది.
నేడు, షియోమీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు భారతదేశం లో మీ ఏ2 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ని విడుదల చేయనుంది మరియు సంస్థ ఆన్లైన్ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ మీ ఏ2 లాంచ్ యొక్క లైవ్ స్ట్రీమింగ్ అందుకోవచ్చు. షియోమీ కూడా మీ ఏ2 లైవ్ స్ట్రీమ్ మరియు 100 F-కోడ్స్ అందుకోవాలని ఆసక్తి ఉన్నవారి కోసం ఈ 100 F- కోడులు ఇస్తున్నట్లు చెప్పింది అయితే ఇక్కడ పోటీ కోసం ముందుగా నమోదు చేయాల్సి ఉంటుంది. షియోమీ అందించే ఈ F- కోడులు వరుసక్రమంలో ముందు వున్న కొనుగోలుదారులకు అందుతాయి మరియు వాటి ఫ్లాష్ అమ్మకాలు సమయంలో, కూడా అదే విధంగా ముందున్న వారికి గ్యారెంటీగా ఒక హ్యాండ్సెట్ అందుతుంది . ఇది ముందుగా Amazon.in లో అమ్మకానికి ఉండనుంది కాబట్టి షియోమీ మీ ఏ2 ని పొందడానికి ఇది ఒక సరైన ఖచ్చిత మార్గం.
షియోమీ ప్రపంచవ్యాప్తంగా దాని మీ ఏ2 ను విడుదల చేసినప్పుడు, కంపెనీ మీ ఏ 2 లైట్ ని కూడా ఆవిష్కరించింది.ఈ మీ ఏ 2 లైట్ కూడా ఆల్-మెటల్ మరియు ఆండ్రాయిడ్ వన్ తో వస్తుంది, కానీ మీ ఏ 2 కాకుండా, మీ ఏ 2 లైట్ లో నోచ్ డిస్ప్లేఉంది. దురదృష్టవశాత్తు, మీ ఏ 2 లైట్ విడుదల కానున్న జాబితాలో భారతదేశం యొక్క పేరు లేదు, కాబట్టి మీరు షియోమీ యొక్క తాజా ఆండ్రాయిడ్ వన్ ఫీచర్ ఫోన్ కొనుగోలు కోసం చూస్తుంటే మాత్రం మీ ఏ 2 ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆలశ్యం చేయకుండా ఈ డివైజ్ల యొక్క స్పెక్స్ చూద్దాం రండి.
షియోమీ మీ ఏ 2 స్పెసిఫికేషన్స్
షియోమీ మీ ఏ 2 ప్రపంచవ్యాప్తంగా మూడు రంగులలో విడుదల చేయబడింది అవి – గోల్డ్, బ్లూ మరియు బ్లాక్. 7.3 ఎమ్ఎమ్ సన్నని ఈ ఫోన్ అల్యూమినియం బిల్డ్ కలిగి ఉంది మరియు ఇది ఒక 5.99-అంగుళాల పూర్తి HD + ప్రదర్శనను కలిగి ఉంది, దీని యొక్క యాస్పెక్ట్ రేషియో 18: 9 గా వుంది . కొత్త జెనరేషన్ బ్లూటూత్ – 5.0 తో పాటుగా గత సంవత్సరం ఫ్లాగ్ షిప్ అయిన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో పాటు ఈ ఫోన్ వస్తుంది.
ఫోన్ దాని శక్తిని ఒక ఆక్టా – కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ నుండి 2.2GHz వద్ద క్లాక్ చేసింది. గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ లో ఫోన్ ని ప్రారంభించినందున, వినియోగదారులు గూగుల్ క్లౌడ్లో అపరిమితమైన అధిక-నాణ్యత ఫోటోలను నిల్వచేసికోవచ్చు , అలాగే నెలవారీ భద్రతా అప్డేట్ మరియు సాధారణ OS సాఫ్ట్వేర్ అప్డేట్ పొందుతారు. వాస్తవానికి, ఈ సంవత్సరం తర్వాత విడుదల కానున్న ఆండ్రాయిడ్ పై కి అప్డేట్ చేయగల మొదటి ఫోన్ల లో మీ ఏ 2 కూడా ఒకటిగా ఉంటుంది.
ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు డ్యూయల్ – కెమెరా సెటప్ సమలేఖనంగా నిలువుగా మీ ఏ 2 వెనుక భాగంలో వున్నాయి. మీ ఏ 2 లో డ్యూయల్ – కెమెరా కోసం 1.25 మైక్రో పిక్సెల్ కలిగి ఉన్న సోనీ IMX486 సెన్సార్ మరియు ఒక సెకండరీ 20ఎంపీ సోనీ IMX376 సెన్సార్తో పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ కోసం కలిగి ఉంది. రెండు లెన్సులు f /1.75 ఆపేర్చేర్ ని కలిగి ఉంటాయి. సోనీ IMX376 సెన్సార్ మరియు షియోమీ యొక్క సూపర్ పిక్సెల్ టెక్నాలజీతో 20ఎంపీ ముందు కెమెరా ఉంది. మెరుగైన నాణ్యత కలిగిన మెరుగైన బొకే ఫోటోల కోసం మరియు HDR కొరకు ముందు కెమెరాలో AI-ఆధారిత సిమాంటెక్ సెగ్మెంటేషన్ ను కలిగి వుంది.
షియోమీ మీ ఏ 2 ధర
ఇటీవల విడుదలైన Amazon.in పై లిక్ లిస్టింగ్ లో, ఈ ఏ 2 4 జీబి ర్యామ్ / 64జీబీ స్టోరేజి వేరియంట్ కోసం 17,499 రూపాయల వద్ద చూపించాయి. మీ ఏ2 మూడు వేరియంట్లలో వస్తుంది అవి – 4జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజి , యూరప్ లో 249 యూరోలు (సుమారు రూ .20,000), 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజి ధర 279 యూరోలు (సుమారు రూ. 24,000), మరియు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజి వెర్షన్ 349 యూరోలు (సుమారు రూ. 28,000). షియోమీ మీ ఏ 2 లో LPDDR4X ర్యామ్ ని చేర్చారు మరియు ఈ స్మార్ట్ ఫోన్ బాక్స్ లోపల ఒక మృదువైన బ్యాక్ కవర్ తో కలిసి ఉంటుంది.
షియోమీ దాని ఉత్పత్తులను క్యాష్ బ్యాక్ తో పాటు అందించడానికి రిలయన్స్ జియో తో భాగస్వామి అని తెలుస్తోంది, కాబట్టి మేము కూడాషియోమీ మీ ఏ 2 కోసం ఇలాంటి ప్రకటనలు ఇంకా ఉండవచ్చని ఆశిస్తున్నాము.