Xiaomi Mi A2 ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా 12 PM వద్ద అమ్మకాలు మొదలవనున్నాయి

Xiaomi Mi A2  ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా 12 PM వద్ద అమ్మకాలు మొదలవనున్నాయి
HIGHLIGHTS

Xiaomi Mi A2 ఆండ్రాయిడ్ వన్ తో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రత్యేకంగా గా అందుబాటులో ఉంటుంది.

నేడు, అమెజాన్ Xiaomi యొక్క తాజా స్మార్ట్ఫోన్ Mi A2 యొక్క ఫ్లాష్ సెల్ ప్రారంభించనుంది, మీరు ఇంతకముందు సేల్ లో ఈ డివైజ్ కొనుగోలు చేయలేక పోయినట్లయితే,  మీరు ఇప్పుడు జరిగే "FLASH SALE " ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు. మీరు ఈ రోజు 12 మధ్యాహ్నం ప్రారంభమైన సెల్లో Xiaomi Mi A2 డివైజ్ కొనుగోలు చేయవచ్చు. అయినప్పటికీ, మేము చాల సేల్స్ లో చూస్తున్నట్లుగా డివైజ్ కొన్ని నిమిషాల్లో విక్రయించబడుతోంది, ఈ సెల్ కూడా మీరు  అదే విధంగా చూడవచ్చు.  ఈ పరికరం ధర రూ .16,999. ఇది Android One ప్లాట్ఫారమ్ లో ప్రారంభించబడింది మరియు ఇది Android 8.1 Oreo తో నడుస్తుంది.

ఈ డివైజ్ కొనుగోలుతో రిలయన్స్ జియో ద్వారా మీరు రూ. 2,200 తక్షణ క్యాష్బ్యాక్ అందుకునే అవకాశము ఉంటుంది. అయితే, జియో తరపున, మీరు డివైజ్  తో 4.5TB అదనపు డేటా గురించి పొందుతారు. అయితే, దీనికి రూ .198 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.

షియోమీ మీ ఎ2 స్పెసిఫికేషన్స్

డిజైన్ పరంగా, మీ ఎ2 రెడ్ మీ నోట్ 5 ప్రో (సమీక్ష) ను చాలా పోలి ఉంటుంది. ఇది కార్నింగ్  గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షించబడింది ఇంకా ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తోకూడిన  ఒక 5.99 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లేని కలిగి ఉంది.  అలాగే ఈ డివైజ్ 2.2GHz ఆక్టా  కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు నిలువుగా అమర్చిన డ్యూయల్ – కెమెరా సెటప్ వెనుకభాగంలో ఉంటాయి.

ఆప్టిక్స్ పరంగా చుస్తే, ఈ మీ ఏ 2 లో 1.25 – మైక్రాన్  పిక్సల్స్ తో కూడిన సోనీ IMX486 సెన్సార్ తో  12ఎంపీ కెమేరా ప్రధానమైందిగాను మరియు  సోనీ IMX376 సెన్సార్ 20ఎంపీ ద్వితీయ కెమేరాగాను కలిగి ఉంది.  ఇది పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీకి  అనుమతిస్తుంది. రెండు లెన్సులుకూడా f /1.75 ఎపర్చరును కలిగి ఉంటాయి. ముందు భాగంలో,షియోమీ యొక్క సూపర్ పిక్సెల్ టెక్నాలజీతో సోనీ IMX376 సెన్సార్  20ఎంపీ కెమెరాని అందించారు. అలాగే ఇది క్విక్ ఛార్జ్ 4+ కు మద్దతు ఇచ్చే 3,000 mAh బ్యాటరీతో హ్యాండ్సెట్ మద్దతు ఇస్తుంది. డివైజ్ ఒక 3.5mm హెడ్ఫోన్ జాక్ ఇందులో మీరు మిస్ అవుతారు అయితే దీనికి   బదులుగా, ఇది ఒక USB టైప్- C పోర్ట్ కలిగి వస్తుంది.

ఆండ్రాయిడ్ Oreo OS తో ఈ  స్మార్ట్ ఫోన్ నడుస్తుంది, ఇది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ కార్యక్రమం కింద ప్రారంభించబడింది కాబట్టి, వినియోగదారులకు గూగుల్ క్లౌడ్, నెలసరి భద్రతా అప్డేట్స్ మరియు కనీసం త్వరలో రానున్న రెండు అతిపెద్ద OS అప్డేట్స్ ద్వారా అపరిమితమైన అధిక-నాణ్యత ఫోటో స్టోరేజీ చేసే అవకాశం లభిస్తుంది. షియోమీ మీ ఎ2 మొట్టమొదటిసారిగా మాడ్రిడ్లో ప్రారంభించబడింది, స్పెయిన్ తో పాటుగా యూరప్ మొత్తంలో తన ఉనికిని విస్తరించడానికి చూస్తోంది ఇప్పుడు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo