షావోమి Mi 9 అద్భుతమైన ఫీచర్లతో రానుంది : అధికారకంగా వివరాలను వెల్లడించిన షావోమి సంస్థ

Updated on 19-Feb-2019
HIGHLIGHTS

ఈ ఫోన్ తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 SoC తో నడుస్తుంది.

 షావోమి, దాని రాబోయే మి ​​9 స్మార్ట్ ఫోన్ గురించి దాదాపు పూర్తిగా తెలియపరిచేలా కొన్నివివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ తయారీదారు గతంలో, ఫిబ్రవరి 20 న అధికారికంగా ఈ ఫోన్ను ప్రకటించనునట్లు తెలియపరిచింది. ఇక్కడ విశేషమేమిటంటే, అదే రోజున శామ్సంగ్ దాని గెలాక్సీ S20 సిరీస్ ఫోన్లను విడుదలచేయనుంది. అయితే, తన ప్రణాళికలకు వ్యతిరేకంగా, ఈ ఫోన్ కోసం సెట్ చేసిన తేదీ కంటే ముందుగానే దాని వివరాలన్నటినీ చూపించాలని సంస్థ నిర్ణయించింది. ఈ ఫోన్ యొక్క ముందు రెండర్ల నుండి, ఇది ఇప్పటికే 90.7 శాతం స్క్రీన్ -టూ -బాడీ రేషియాతో ఒక వాటర్డ్రోప్ నోచ్ రూపకల్పనను కలిగివుంటుందని,  మనకు ఇప్పటికే తెలుసు. అయితే, Xiaomi Mi 9 ఒక పూర్తి HD + స్పష్టత అందించే శామ్సంగ్ యొక్క AMOLED ప్యానెల్ కలిగి ఉంటుంది. ఇది 600 nit అత్యధికంగా బ్రైట్నెస్ కలిగి ఉంటుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ద్వారా రక్షించబడుతునట్లు ఇప్పుడు ప్రకటించింది.

షావోమి మి 9  డిస్ప్లే పరిమాణం వెల్లడించలేదు కానీ , ఈ ఫోన్ యొక్క  డిస్ప్లేలో ఒక ఆప్టికల్ వేలిముద్ర సెన్సార్ ఉన్నట్లు  ధ్రువీకరించారు. ఈ డిస్ప్లేలో సన్ లైట్  మోడ్ 2.0 మరియు రీడింగ్ మోడ్ 2.0 వంటి ఫీచర్లు  ఉంటాయి, ఇవి పరిసర కాంతి పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్నెస్ మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అంతేకాకుండా, ఈ ఫోన్ తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 SoC తో నడుస్తుంది, దీనిని 7nm ప్రాసెస్ ఉపయోగించి తయారు చేస్తారు. షావోమి కొత్త ప్రాసెసర్ ఎక్విపింగ్ తర్వాత, Mi 9 Antutu బెంచ్మార్క్ వద్ద 387,851 స్కోర్లు సాధించినట్లు చెబుతోంది. ఇది Antutu జాబితాలో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ చేస్తూ ఉన్నదాని కంటే ఎక్కువగా ఉంటుంది, దీని మి మిక్స్ 2S స్మార్ట్ ఫోన్ 297,077 స్కోరుతో ఉంటుంది.

ఆప్టిక్స్ పరంగా, Mi 9 ఒక ట్రిపుల్ – వెనుక కెమెరా సెటప్పును కలిగి ఉంటుంది. ఇది 0.8 μm పిక్సెల్ పిచ్ మరియు ఒక 1/2-inch ఇమేజ్ సెన్సరుతో 48MP ప్రధాన సోనీ IMX586 సెన్సార్ను కలిగి ఉంది. ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగుకు మద్దతు ఇస్తుంది మరియు 6P లెన్స్ ను కలిగి ఉంది. ఇంకా, ఒక 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు ఒక 12MP టెలిఫోటో లెన్స్ ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరాలో ఉంటాయి. ఈ అల్ట్రా వైడ్-యాంగిల్ లెన్స్ ఒక f / 2.2 ఎపర్చరు మరియు 117-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కలిగివుంటుంది. ఇక ఈ 12MP టెలిఫోటో కెమెరాకి f / 2.2 ఎపర్చర్ కూడా లభిస్తుంది, కానీ 1.0 μm యొక్క పిక్సెల్ పరిమాణం వస్తుంది. ఈ ఫోన్ యొక్క ప్రధాన కెమెరా PDAF మరియు CDAF మద్దతుతో లేజర్ ఆటోఫోకస్లను మరియు సప్పైర్ బ్లూ గ్లాస్ రక్షణను పొందుతుంది. ఈ ఫోన్ యొక్క ముందు కెమెరా యొక్క సమాచారాన్నిమాత్రం విడుదల చేయలేదు.

మి 9  "అసాధారణమైన ధ్వని నాణ్యత" ను అందిస్తుందని షావోమి చెప్పింది, ఇది 0.9 cc వంటి పెద్ద స్పీకర్ బాక్సుకు సమానం. అదనంగా, ఈ హ్యాండ్ సెట్ ఒక గేమ్ టర్బో లక్షణాన్ని కలిగి ఉంటుంది, ఇది వినియోగదారులను రియల్ టైం లో  CPU / GPU / FPS ను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. ఇది "గేమింగ్ సన్నివేశాలను అంచనా వేస్తుంది మరియు సంక్లిష్టంమైన సన్నివేశాల కోసం వనరులను కేటాయిస్తుంది." ఈ లక్షణం ఎలా పని చేస్తుందో వివరణాత్మక సమాచారం ఇంకా తెలియపరచలేదు. షావోమి మి 9, లావెండర్ వైలెట్, ఓషన్ బ్లూ, మరియు పియానో ​​బ్లాక్ వంటి మూడు రంగులలో వస్తుంది.

షావోమి మి 9 : బ్యాటిల్ ఏంజెల్, అని పిలువబడే ఈ పరికరం యొక్క ఒక ప్రత్యేక నాల్గవ వేరియంట్ ఫిబ్రవరి 24 న ప్రారంభించబడుతుంది. కంపెనీ వ్యవస్థాపకుడు లీ జున్ , Mi 9 పారదర్శక ఎడిషన్ యొక్క  కొన్ని వివరాలను వెల్లడించారు. ఇది 48MP ప్రాధమిక వెనుక కెమెరా 6P లెన్సుకు బదులుగా, ఇది ఒక 7P లెన్సుతో  f / 1.47 ఎపర్చరుతో అందించబడుతుంది. ఈ ఫోన్ యొక్క మిగిలిన లక్షణాలు Mi 9 వలెనే ఉండవచ్చని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :