Xiaomi Mi 9 స్మార్ట్ ఫోన్ మొట్టమొదటి స్నాప్ డ్రాగన్ 8150 చిప్సెట్ పరికరం కావచ్చు

Updated on 08-Nov-2018
HIGHLIGHTS

ఈ Mi 9, 2019 ప్రథమార్ధంలో 48MP - Sony IMX586 సెన్సార్ కలిగిన ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు స్నాప్ డ్రాగన్ 8150 కలిగి విడుదలకానున్న, షావోమి ప్రధాన పరికరం కావచ్చని పుకార్లు వస్తున్నాయి.

గతంలో,  Xiaomi యొక్క Mi Mix 3 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8150 చిప్సెట్ తో వస్తుంది (గతంలో స్నాప్డ్రాగెన్ 855 గా పిలిచే) అనుకున్నారు కానీ, ఇతర ఫ్లాగ్ షిప్ ఫోన్ల వంటి,  స్నాప్ డ్రాగన్ ద్వారా ఆధారితమైన 845 SoC తో వచ్చింది. దీనిని విడుదల చేసిన తర్వాత కేవలం ఒక వారం రోజులకే,  Xiaomi యొక్క మరొక స్మార్ట్ఫోన్  'Mi' 9 పేరు గురించిన పుకార్లు వచ్చాయి,  ఇందులో స్పష్టంగా స్నాప్ డ్రాగన్ 8150 చిప్సెట్ ని పొందుపరచడానికి  దీనిని  సిద్ధంచేస్తున్నట్లు వుంది. ఇది వచ్చే ఏడాది ఆవిష్కరించబడుతుంది. సరఫరా విభాగం నుండి ఒక సూచనను పేర్కొనడంతో, 'షావోమి మి 9' స్నాప్డ్రాగెన్ 8150 చిప్సెట్తో రానున్న మొట్టమొదటి ఫోనుగా పేర్కొంది.

టెక్ న్యూస్ వేదిక కూడా ఈ Xiaomi Mi 9 స్మార్ట్ ఫోన్, 2019 ప్రథమార్ధంలో రానున్నట్లు పేర్కొన్నారు  మరియు మి 8 వలనే,  ముందుగా చైనాలో ప్రారంభించనున్నట్లు కూడా తెలుస్తోంది . మి 9 స్మార్ట్ ఫోన్,  48MP – Sony IMX586 సెన్సార్ కలిగిన ఒక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఈ హ్యాండ్ సెట్లో సాధారణ వేరియంట్లు  6GB లేదా 8GB RAM తో రావచ్చు, హై ఎండ్ వేరియంట్ 10GB RAM కలిగి ఉండవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్  ఒక AMOLED డిస్ప్లేతో మరియు ఈ హ్యాండ్ సెట్ యొక్క  డిస్ప్లేలో వేలిముద్ర స్కానర్ను కలిగిఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.

HTC కూడా దాని యొక్క తదుపరి స్మార్ట్ ఫోన్ గురించి  పనిచేస్తుంది, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8150 మరియు 5G మద్దతుతో శక్తినివ్వగలదని చెబుతోంది. HTC యొక్క సీనియర్ RF డిజైనర్ కెవిన్ డ్యూయో (TechSpot ద్వారా) ప్రకారం, ప్రస్తుతం కంపెనీ స్నాప్డ్రాగెన్ 8150 ను పరిశీలించడం జరుగుతోంది, ఇది ప్రస్తుత స్నాప్ డ్రాగన్  ఫ్లాగ్ షిప్ పనితీరు మరియు సామర్థ్యానికి అడ్డుగోడను తీసుకురావచ్చని అంచనా. HTC  కూడా క్వాల్కామ్ యొక్క స్నాప్ డ్రాగన్ X50 5G- రెడీ  మోడెముతో ప్రయోగాలు చేస్తున్న కార్యనిర్వాహక గమనికలు చిప్ యొక్క అదనపు ఎంపికతో అందించబడుతుందని భావిస్తున్నారు, సాధారణంగా ఇది ఒక X24 LTE మోడెమ్ ప్రమాణంగా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :