షియోమీ గత నెలలో చైనా లో Xiaomi Mi 6 ని లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లుగా లాంచ్ చేయబడింది . స్టాండర్డ్ ఎడిషన్ లో గ్లాస్ బాడీ కలదు. మరియు రెండవది సిరామిక్ అడిషన్ . వచ్చిన పుకార్ల ప్రకారం కంపెనీ త్వరలో దీని లైట్ వేరియంట్ కూడా ప్రవేశపెట్టబోతుంది.దీని కొత్త వేరియంట్ పేరు Mi 6 Youth Editon లేదా Mi 6 Lite Edition అవ్వొచ్చు . మరియు దీనిలో స్నాప్ డ్రాగన్ 660 ప్రోసెసర్ ఉండొచ్చు . Xiaomi Mi 6 Lite వేరియంట్ ధర 1999 Yuan ఇండియన్ కరెన్సీ ప్రకారం Rs. 18,597 ఉంటుంటుంది. ఇది జూన్ మొదటి వారం లో రిలీజ్ అవ్వనుంది. .
రూమర్స్ ప్రకారం ఈ కొత్త వేరియంట్ లో కూడా Xiaomi Mi 6 లాంటి స్పెక్స్ కలవు . కొత్త లైట్ వేరియంట్ లో స్నాప్ డ్రాగన్ 660 చిప్సెట్ ఉంటుంది.
Xiaomi Mi 6 లో 5.15- ఇంచెస్ ఫుల్ 1080p డిస్ప్లే గలదు . దీనిలో ఫ్రంట్ మరియు బ్యాక్ న గ్లాస్ ఉపయోగించారు. క్వాల్ కాం స్నాప్డ్రాగన్ 835 64- బిట్ ఆక్టో కోర్ ప్రోసెసర్ గలదు. దీని క్వాల్క్ స్పీడ్ 1.45GHz మరియు దీనిలో అడ్రినో 540 GPU . మరియు 6GB RAM తో 64GB/128GB స్టోరేజ్ ఆప్షన్స్ కూడా కలవు. ఆండ్రాయిడ్ 7.1.1 nougat ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 3350mAh బ్యాటరీ కలదు. డ్యూయల్ కెమెరా గలదు . రెండు కెమెరాలు 12 ఎంపీ 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా .