Xiaomi రీసెంట్ గా 25 వేల రూ లకు Mi 5 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేయటం జరిగింది ఇండియాలో. ఇప్పుడు MyDrivers సైట్ రిపోర్ట్ ప్రకారం Mi 5 కు అప్ గ్రేడ్ వేరియంట్ తెస్తుంది కంపెని.
పేరు Mi 5S. దీనిలో ఒరిజినల్ వేరియంట్ లో లేని మంచి ఫీచర్ ను కూడా యాడ్ చేయనుంది అని రిపోర్ట్. pressure-sensitive డిస్ప్లే పేరుతో వస్తుంది ఈ ఫీచర్.
ఇది ఆపిల్ ఐ ఫోన్ 6S లో ప్రవేశ పెట్టిన 3D force టచ్ pressure పాయింట్ కు సిమిలర్ గా ఉంటుంది. ఇంకా ఫోన్ లో Qualcomm ultrasonic ఫింగర్ ప్రింట్ సెట్ అప్ మరియు డ్యూయల్ రేర్ కెమెరా సెట్ అప్ ఉంటుంది అని రిపోర్ట్స్.
ఇంకా ఫోన్ లో 6GB ర్యామ్ ఉండనుంది. స్క్రీన్ మాత్రం 5.15 FHD డిస్ప్లే. స్నాప్ డ్రాగన్ 820 నుండి 821 కు కూడా అప్ గ్రేడ్ అవుతుంది అని అంచనా.
అయితే ఫోన్ రిలీజ్ అవటానికి 2016 చివరి వరకూ వేచి ఉండాలి.