Xiaomi Mi 5 ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్
xiaomi నుండి mi 4c అనే మోడల్ తరువాత Mi 5 ఫ్లాగ్ షిప్ మోడల్ రిలీజ్ కు దగ్గరిలో ఉంది. తాజాగా ఇప్పుడు Mi 5 కు సంబందించిన టీజర్ ఇమేజ్ లీక్ అయ్యింది.
చైనీస్ ఫేమస్ లీక్ ఇమేజెస్ పోర్టల్, Weibo లో ఈ ఇమేజ్ లీక్ అయ్యింది. స్పెసిఫికేషన్స్ పరంగా లేదా ఫోన్ లుక్స్ వైజ్ గా ఏమీ లీక్ అవలేదు. సింపుల్ గా 5 అనే నంబర్ తో "Are you ready" అని వ్రాసి దాని క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ సింబల్ ఉంది.
అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండటం పెద్ద విషయం కాదు, దాదాపు అన్ని మేజర్ మరియు మిడ్ ర్యన్జ్ బడ్జెట్ బ్రాండ్ లలో ఇది రానుంది. one ప్లస్ 2, సామ్సంగ్ S6, huawei mate S వంటి ఫోనులు ప్రస్తుతానికి అందుబాటులో కూడా ఉన్నాయి.
ముందు ముందు సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేస్తే, ఫింగర్ ప్రింట్ స్కానర్ కేవలన్ అన్ లాక్ కోసమే కాకుండా చాలా ఈజీగా షాపింగ్ మరియు ఇతర మొబైల్ పనులు చేసే అవకాశాలు ఉన్నాయి జస్ట్ స్వైప్స్ తో.
Mi 5 లో లేటెస్ట్ హై ఎండ్ మీడియా టెక్ Helio X20 (10 కోర్స్ ) ప్రోసేసర్స్ 5.3 క్వాడ్ HD(నాలుగు HD లు), 4gb ర్యామ్, 16MP, usb టైప్ c పోర్ట్(సింగిల్ పోర్ట్ లో అన్నీ కనెక్షన్స్ సపోర్ట్), 64gb స్టోరేజ్ ఉండనున్నాయని ఇప్పటివరకూ వచ్చిన రుమర్డ్ స్పెక్స్ చెబుతున్నాయి.
రీసెంట్ గా ఈ Helio x20 SoC AnTuTu బెంచ్ మార్క్ లో 70,000 స్కోర్ చేసినట్లు రిపోర్ట్స్. సెప్టెంబర్ 8 న, అంటే ఆపిల్ 6S ఫోన్ రిలీజ్ చేసే ముందు రోజు xiaomi ఇండియాలో కొత్త మోడల్ ను లాంచ్ చేస్తుంది.